స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర భద్రతను మరింతగా పెంచాలి : నాగబాబు

-

ఆంధ్ర ప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్పదని.. అసహనంతోనే హింసకు పాల్పడుతున్నారని , ఈవీఎంలు ఉన్న స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర భద్రత పెంచాలని జనసేన నేత నాగబాబు ఎన్నికల సంఘాన్ని కోరారు.హింసకు పాల్పడ్డ వైసీపీ నేతలే ఎన్నికల సంఘాన్ని, పోలీసులను నిందించడం విడ్డూరంగా ఉందని ,దొంగే దొంగ అని అరిచినట్టుగా వైసీపీ నేతల తీరు ఉందని ఆయన ఎద్దేవా చేశారు.

పోలింగ్ అనంతరం ఆంధ్ర ప్రదేశ్ లో నెలకొన్న హింసపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ఈవీఎంలు భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర భద్రతను మరింతగా పెంచాలని నాగబాబు కోరారు. జూన్ 4న ఎన్నికల్లో వచ్చే ప్రజాతీర్పుతో వైసీపీ మరోసారి హింసకు పాల్పడే అవకాశం ఉంది. ఆ రోజున పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని , రాష్ట్రంలో ఓటర్లు విజ్ఞతతో ఓట్లు వేశారని తెలిపారు. 81.86 శాతం పోలింగ్ నమోదు కావడమే ఇందుకు నిదర్శనమని నాగబాబు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news