పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్.. మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ప్రాజెక్ట్ కె. దీపికా పదుకొణె హీరోయిన్గా.. అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఈ మూవీ రెండు పార్టులుగా తెరకెక్కనున్నట్లు ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. ప్రాజెక్టు కె సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించే దిశగా చిత్రబృందం ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై మూవీ టీమ్ ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే, తాజాగా Project K నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా గ్లింప్స్ ను ఈ నెల 21న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం. 20వ తేదీన అమెరికాలో గ్లింప్స్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు.
The world awaits the ultimate showdown.
Brace yourselves for a glimpse into the world of #ProjectK on July 20 (USA) & July 21 (INDIA).Stay tuned and Subscribe: https://t.co/AEDNZ3ni5Q#Prabhas @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @VyjayanthiFilms… pic.twitter.com/MMc60mrHxH
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 14, 2023