పుట్టిన వెంటనే జీవితం ముగిసే జీవులు తెలుసా? నిజాలు షాక్ చేస్తాయి!

-

ప్రకృతిలో ప్రతి జీవికి ఒక నిర్దిష్ట జీవితకాలం ఉంటుంది. మనిషి వందల సంవత్సరాలు జీవిస్తే, కొన్ని జంతువులు దశాబ్దాల పాటు బ్రతుకుతాయి. కానీ ఈ భూమిపై పుట్టిన గంటలలోనే లేదా కేవలం ఒకే ఒక్క రోజులో తమ జీవితాన్ని ముగించుకునే జీవులు ఉన్నాయని మీకు తెలుసా? వాటి ఉనికి అతి తక్కువ సమయం అయినప్పటికీ వాటి లక్ష్యం చాలా గొప్పది. ఆశ్చర్యం కలిగించే విధంగా అతి తక్కువ ఆయుష్షు ఉన్న ఆ జీవుల గురించి వాటి ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందాం..

అత్యంత తక్కువ జీవితకాలం కలిగిన జీవులలో ప్రముఖంగా చెప్పుకోదగినవి మేఫ్లైస్ (Mayflies). ఈ కీటకాల జీవిత చక్రం యొక్క వయోజన దశ కేవలం కొన్ని గంటల నుంచి గరిష్టంగా 24 గంటలు మాత్రమే ఉంటుంది. అందుకే వీటిని ‘ఒక రోజు కీటకాలు’ అని కూడా అంటారు.

Creatures That Die Right After Birth – Shocking Natural Facts
Creatures That Die Right After Birth – Shocking Natural Facts

మేఫ్లైస్ యొక్క లక్ష్యం కేవలం సంతానోత్పత్తి మాత్రమే. అవి లార్వా రూపంలో ఒకటి లేదా రెండు సంవత్సరాలు నీటిలో నివసించినప్పటికీ రెక్కలు వచ్చిన వయోజన దశలో మాత్రం వాటికి నోరు, జీర్ణవ్యవస్థ పనిచేయవు. అంటే అవి ఆహారం తీసుకోకుండా కేవలం తమకు కేటాయించిన అతి తక్కువ సమయంలో సంభోగం చేసి, గుడ్లు పెట్టే పనిని మాత్రమే పూర్తి చేసి తమ జీవితాన్ని ముగిస్తాయి.

మేఫ్లైస్ మాత్రమే కాకుండా కొన్ని రకాల గ్యాస్ట్రోట్రిక్ (Gastrotrich) అనే సూక్ష్మ జీవులు కూడా చాలా తక్కువ ఆయుష్షు కలిగి ఉంటాయి. ఈ జలచరాలు కేవలం మూడు రోజులలోనే పుట్టి, పెరిగి, సంతానోత్పత్తి చేసి మరణిస్తాయి. అలాగే, అంటార్కిటిక్‌లో కనిపించే కొన్ని స్పాంజ్‌లు (Sponges) తమ పెరుగుదల ప్రక్రియను పూర్తి చేయడానికి సుమారు 30 సంవత్సరాలు తీసుకుంటాయి.

కానీ వయోజన దశకు చేరుకున్న కొన్ని రకాల స్పాంజ్‌లు కేవలం ఒక వారం లేదా పది రోజులు మాత్రమే జీవిస్తాయి. ఈ జీవులన్నీ ప్రకృతిలో తమ పాత్రను సమర్థవంతంగా పోషిస్తాయి. వాటి జీవితకాలం ఎంత తక్కువైనా, అవి తమ వంశాన్ని కొనసాగించేందుకు పర్యావరణ వ్యవస్థలో తమ విధిని పూర్తి చేసేందుకు సిద్ధపడతాయి.

Read more RELATED
Recommended to you

Latest news