ఈ క్రెడిట్ కార్డు ఉందా..? జనవరి నుంచి కొత్త రూల్స్.. మరి చూసుకోండి..!

-

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కోసం ఎన్నో రకాల సేవలని తీసుకు వస్తోంది. ఈ సేవల ద్వారా చాలా మందికి ప్రయోజనం కలగనుంది. పైగా మనం స్టేట్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ని కూడా ఎక్కువ వాడుతూ ఉంటాము.

షాపింగ్ కు వెళ్లినా, లేదా ఆన్‌లైన్‌ షాపింగ్ చేసినా క్రెడిట్ కార్డు తో పేమెంట్ ఈజీగా చేసేయచ్చు. పైగా బ్యాంకులు తమ కస్టమర్లకు వివిధ ఆఫర్ల తో క్రెడిట్ కార్డులు ఇస్తున్నారు. స్టేట్ బ్యాంక్ అందించే క్రెడిట్ కార్డు ని కూడా చాలా మంది వాడుతున్నారు. చిన్న, మధ్య తరగతి వారైతే ఎస్ బీఐ సింప్లి క్లిక్ పేరు తో ఉన్న క్రెడిట్ కార్డులను ఇస్తోంది. దీని లిమిట్ క్రెడిట్ స్కోర్ ని బట్టీ ఉంటుంది.

రూ.15,000 లిమిట్ తో సింప్లి క్లిక్ కార్డులను అందించింది బ్యాంకు. అయితే ఈ కార్డుని వాడేవాళ్ళకి ఇప్పుడు బ్యాంకు షాక్ ఇచ్చింది. జనవరి 2023 నుంచి ఈ కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. వోచర్లు, రివార్డు పాయింట్ల రిడీమ్ కి సంబంధించి కొన్ని రూల్స్ ని మార్చారు. జనవరి 6, 2023 నుంచి ఎస్‌బీఐ సింప్లి క్లిక్ క్రెడిట్ కార్డు యూజర్లకు జారీ చేసే క్లియర్ ట్రిప్ వోచర్ ని ఎక్కువ సార్లు రీడిమ్ చేసుకునే వీలు లేకుండా కేవలం ఒక్కసారి మాత్రమే రిడీమ్ చేసుకోవాలి అని నిర్ణయం తీసుకుంది. పైగా ఈ వోచర్ ఏ ఇతర వోచర్ల తోనూ, ఆఫర్లతోనూ కలిపి రాదు. జనవరి 01, 2023 నుంచి అమెజాన్ వెబ్ సైట్ లో ఈ కార్డు ని వాడితే వచ్చే రివార్డు పాయింట్లను తగ్గించేసింది. ఈసారి పది రావు. కేవలం ఐదు పాయింట్లే వస్తాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version