కేక్ కట్ చేసేందుకు నిరాకరించిన క్రికెటర్ అజింక్య రహానే.. ఎందుకంటే..!

-

ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన బార్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాపై 2-1 తేడాతో భారత్ చారిత్రాత్మక టెస్టు విజయాన్ని సొంతం చేసుకుంది. భారత జట్టుకు ఇంచార్జ్ కెప్టెన్ గా వ్యవహరించిన అజింక్య రహానేకు అన్ని వర్గాల ప్రజలు ప్రశంసల వర్షం కురిపించారు. ఆస్ట్రేలియా గడ్డపై మరోసారి భారత జట్టు చారిత్రక టెస్టు సిరీస్ విజయాన్ని అందుకుంది. బ్రిస్బేన్ వేదికగా జరిగిన చివరి టెస్టుల్లో 328 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా.. రిషబ్ పంత్ (89 నాటౌట్), శుభమన్ గిల్ (91) దూకుడు ప్రదర్శించారు. మూడు వికెట్ల తేడాతో అవలీలగా విజయాన్ని సాధించారు.

rahane
rahane

అడిలైడ్ టెస్టులో భారత్ దారుణ ఓటమిని చవి చూసింది. అనంతరం మెల్ బోర్న్, సిడ్నీ, బ్రిస్సేన్ లలో మ్యాచులు ఆడింది. మెల్ బోర్న్ మ్యాచ్ లో గెలువగా.. సిడ్నీ మ్యాచ్ డ్రా అయింది. అనంతరం జరిగిన బ్రిస్బేన్ మ్యాచ్ లో కూగా గెలిచింది. దీంతో అజింక్య రహానే కెప్టెన్సీపై పలువురు ప్రశంసలు కురించారు. మ్యాచులు ముగిసిన తర్వాత క్రికెట్ జట్టు ఇండియాకు వచ్చింది. ఈ మేరకు రహానే కుటుంబ సభ్యులు అతడికి గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు.

ఈ మేరకు కుటుంబ సభ్యులు ఓ కేక్ ను కూడా తీసుకొచ్చారు. అయితే ఆ కేకుపై కంగారు బొమ్మ ఉంది. దీంతో రహానే ఆ కేకును కట్ చేయలేదు. అతడు అలా చేయడానికి కారణమేంటంటే.. కంగారు ఆస్ట్రేలియా దేశ జాతీయ జంతువు కాబట్టి. మన దేశ జాతీయ జంతువును హింసిస్తే ఎవరికైనా కోపం వస్తుంది. అలా చేసిన వాళ్లని జైలులో కూడా పెడతారు. ‘‘ఆస్ట్రేలియాపై గెలుపు కేవలం మ్యాచ్ వరకే. బయటికి వస్తే అందురూ సోదరభావంతో మెలగాలి. గెలుపు, ఓటములను పర్సనల్ తీసుకోవద్దు. అందుకే కేక్ కట్ చేయలేదు.’’ అని రహానే చెప్పుకొచ్చారు. దీంతో రహానేని మెచ్చుకోని వారుండరూ. దేశాలకు, ఆచార వ్యవహారాలకు విలువిస్తున్న రియల్ జెంటిల్మెన్ అని ప్రశంసిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news