హైదరాబాద్‌ లో విచ్చలవిడిగా వ్యభిచారం..ఏపీ నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి !

-

హైదరాబాద్‌ లో విచ్చలవిడిగా వ్యభిచారం జరుగుతోంది. పోలీసులు ఎన్ని కఠిన నియమ నిబంధనాలు అమలు చేసినా…. వ్యభిచారం కొనసాగుతూనే ఉంది. అయితే, తాజాగా తార్నాక విజయపురి కాలనీలోని నటరాజ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ నంబర్ 103 లో సత్యం, శివమ్మ ఎనిమిదేళ్లుగా ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నారు.

తాడేపల్లి, భద్రాచలం, విజయవాడ నుంచి అమ్మాయిలను తీసుకుని వచ్చి పది రోజులు పాటు అపార్ట్మెంట్ లోని ప్లాట్ లోనే ఉంచి వ్యభిచారం చేయిస్తుంటారు. అపార్ట్మెంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు లాలాగూడ పోలీసులు మెరుపు దాడి చేయడంతో గుట్టు బయటపడింది. నిర్వాహకులు శివమ్మతో పాటు ముగ్గురు అమ్మాయిలను పోలీసు అదుపులోకి తీసుకున్నారు. మరో నిర్వాహకుడు సత్యం పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version