BREAKING : తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. విద్యుత్ శాఖలో భారీగా ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో 1000 జూనియర్ లైన్ మెన్ పోస్టుల భర్తీకి త్వరలోనే కొత్త నోటిఫికేషన్ జారీ కానుంది. సబ్ ఇంజనీర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు సోమవారం నియామక పత్రాలను అందజేయడంతో, ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ దాదాపుగా ముగిసింది.
దీంతో జెఎల్ ఎం నోటిఫికేషన్ జారీ పై సంస్థ యాజమాన్యం కసరత్తు ప్రారంభిం చనుందని అధికార వర్గాలు ప్రకటించాయి. ఈ నెలాఖరు లోగా లేదా వచ్చే నెలలో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. వాస్తవానికి 1000 జూనియర్ లైన్ మెన్ పోస్టుల భర్తీకి గత మే 9న సంస్థ యాజమాన్యం నోటిఫికేషన్ జారీ చేసి, జూలై 17న రాత పరీక్ష నిర్వహించారు. అయితే, ఆ రాత పరీక్షల్లో అవతవకలు చోటు చేసుకోవడంతో ఆ నోటిఫికేషన్ ను రద్దు చేసి… ఇప్పుడు మళ్లీ పరీక్ష పెడుతున్నారు.