తెలంగాణ లో 12శాతం పెరిగిన “నేరాలు ఘోరాలు..!

-

దేశ వ్యాప్తంగా నేరాలు ఘోరాలు పెరిగిపోతున్నాయి. ఇక తెలంగాణ లోనూ అదే పరిస్థితి కనిపిస్తుంది. అయితే గతం తో పోలిస్తే ప్రస్తుతం క్రైమ్ రేట్ పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ లో 2019 తో పోలిస్తే నేరాలు 12 శాతం పెరిగాయని జాతీయ నేరాల విభాగం వెల్లడించింది. ఈ విషయాన్ని క్రైమ్ ఇన్ ఇండియా-2020 నివేదికలో పేర్కొంది. గతేడాది తెలంగాణ లో 1,47,501 నేరాలు సంభవించాయి. 827 మంది హత్యకు గురయ్యారు. ఐదుగురు మహిళలపై యాసిడ్ దాడులు జరిగాయి. 2074 పొక్సో కేసులు నమోదయ్యాయి. అంతే కాకుండా 1365 మంది హిట్ అండ్ రన్ కేసుల్లో చనిపోయారు. అలాగే 737 లైంగిక వేధింపుల కేసులు నమోదైనట్లు నివేదిక వెల్లడించింది.

ఇదిలా ఉండగా ఇవి వెలుగులోకి వచ్చినవి…ప్రభుత్వం నిర్ధారించిన కేసులే ఇంకా ప్రభుత్వం దృష్టికి రాని కేసులు ఎన్ని ఉన్నాయో చెప్పలేం. ఇక నిందితులను కఠినం గా శిక్షిస్తున్నా వారిలో మార్పు మాత్రం రావడం లేదు. రాష్ట్రంలో గంజాయి..ఇతర మత్తు పదార్థాల వాడకం కూడా ఎక్కువే అయినట్టు కనిపిస్తోంది. దాంతో మొదట మత్తు పదార్థాల వాడకం ను అరికడితే నేరాలు అదుపులోకి వచ్చే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version