వ్యాక్సిన్ మిక్సింగ్ కు డీసీజీఐ అనుమతి.. మరింత సమాచారం కావాలంటున్న కేంద్రం.

-

వ్యాక్సిన్ల మిశ్రమం గురించి అనేక వార్తలు వచ్చాయి. వేరు వేరు వ్యాక్సిన్లను మిక్సింగ్ చేయడం కరెక్టా కాదా అన్న అంశంపై అనేక చర్చలు జరిగాయి. ఐతే ప్రస్తుతం వ్యాక్సింగ్ మిశ్రమానికి డీసీజీఐ అనుమతి ఇచ్చింది. కానీ ఇది ఎంత మేరకు సామర్థ్యంగా పనిచేస్తుందనే దానిపై మరింత సైంటిఫిక్ సమాచారం కావాలంటూ కేంద్రం కోరింది. ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ల మిక్సింగ్ పై పరిశోధనలు జరుగుతున్నాయి. ఇండియాలోనూ పరొశోధనలకు డీసీజీఐ అనుమతి ఇచ్చింది.

తమిళనాడులోని వేలూరులో క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో పరిశోధనలు జరుగుతున్నాయి. దాదాపు 300మంది వాలంటీర్లపై ట్రయల్స్ నిర్వహించనున్నారు. రెండు వేరు వేరు వ్యాక్సిన్ డోసులను ఇవ్వడం వల్ల రోగనిరోధక శక్తి మరింతగా పెరుగుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కాకపోతే ఈ విషయమై మరింత స్పష్టమైన సమాచారం కావాలని కేంద్రం కోరుకుంటుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version