పంజాబ్‌లో ఘోర ప్రమాదం.. రైళ్లు ఢీకొని 61 మంది మృతి

-

ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 61 మంది ప్రాణాలు క్షణాల్లో గాల్లో ఎగిరిపోయాయి. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 61 మంది దాకా మృత్యవాత పడ్డారు. విజయదశమి సందర్భంగా నిర్వహించిన రావణదహనం కార్యక్రమానికి వచ్చిన ప్రజలు రైల్వే ట్రాక్‌పైనా నిలబడి రావణ దహనాన్ని వీక్షిస్తున్నారు. అదే సమయంలో మృత్యుశకటాల్లా రెండు రైళ్లు పట్టాల మీదికి దూసుకొచ్చారు. పటాకుల సౌండ్‌కు రైళ్ల శబ్ధం వినిపించలేదు. క్షణాల్లో రైలు పట్టాలపై ఉన్న వారిపైకి ఆ రైళ్లు దూసుకెళ్లడంతో జనాలంతా గాల్లో ఎగిరి కింద పడ్డారు. మరో 72 మందికి గాయాలయ్యాయి. జలంధర్ నుంచి అమృత్‌సర్ వెళ్తున్న రైలు ఢీకొనడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో అక్కడ దాదాపు 700 మంది దాకా ఉన్నట్లు సమాచారం.

ఈ ఘటనపై రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు పంజాబ్ సీఎం రూ.5 లక్షల పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు ఉచితంగా వైద్య చికిత్స అందిస్తున్నారు. ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు. పంజాబ్ అంతా ఇవాళ ఒక రోజు సంతాపదినం పాటించాలని సీఎం తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version