ఇది సరికొత్త ఇంటర్నెట్ చాలెంజ్.. కికీకి తాత!

-

బ్లూవేల్ చాలెంజ్, కికీ చాలెంజ్.. ఇలా ఇంటర్నెట్‌లో రోజు ఏదో ఒక చాలెంజ్ నానుతూనే ఉంటుంది. ప్రస్తుతం ఫాలింగ్ స్టార్స్ చాలెంజ్ హవా నడుస్తోంది. అంటే వాళ్ల వాహనాల నుంచి కింద పడటం అన్నమాట. దాన్నే ఫ్లాంట్ యువర్ వెల్త్ అని కూడా అంటున్నారు. వాహనాల నుంచి కింద పడి వాళ్ల దగ్గర ఉన్న విలువైన వస్తువులను చెల్లచెదురుగా పడేయడమే ఈ చాలెంజ్. ఈ చాలెంజ్ గత ఆగస్టులో రష్యాలో ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలింగ్‌స్టార్స్2018 హ్యాష్‌టాగ్ పేరుతో ఈ చాలెంజ్‌లో పాల్గొని తమ ఫోటోలను షేర్ చేస్తున్నారు ఔత్సాహికులు. కార్లు, ప్రైవేట్ జెట్స్, బోట్ల నుంచి కింద పడుతూ.. వాళ్ల లగ్జరీ సామాన్లను కింద పడేస్తున్నారు. అయితే.. ఈ చాలెంజ్ చైనాలో పాపులర్ అయిందట. ఆ తర్వాత ప్రపంచమంతా విస్తరించిందట. ఈ చాలెంజ్‌పై సోషల్ మీడియాలో సెటైరికల్ మెమెలు కూడా మార్మోగిపోతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version