ఏపీలో దారుణం..కన్న కూతురిపై తండ్రి అత్యాచారం

-

మానవ సంబంధాలు మంట కలిసేలా చేస్తున్నారు కొందరు తల్లిదండ్రులు. ప్రియుడిపై ఉన్న మోజుతో పిల్లలను కొందరు తల్లులు హత్యలు చేస్తూ ఉంటే.. మరికొందరు తండ్రులు కామంతో కళ్లు మూసుకుపోయిన కూతురితోనే పాడు పనులు చేస్తున్నారు. కన్న బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవడమే తండ్రి బాధ్యత. అందులోనూ అమ్మాయి అంటే అతనికి ఇంకా ప్రేమ ఎక్కువ ఉండాలి.

నాన్న ఉన్నాడు అని భరోసా కల్పించాలి. కానీ ఓ కన్న తండ్రి తన కూతురి పాలిట కామపిశాచి అయ్యాడు. గుంటూరులో ఈ దారుణం చోటు చేసుకుంది. అరండల్ పోలీసు స్టేషన్ పరిధి లో మైనర్ బాలిక పై కన్న తండ్రి అత్యాచారం చేశాడు. గత కొద్ది నెలలు గా బాలిక ను బెదిరించి అత్యాచారం చేయడం తో గర్బం దాల్చింది బాలిక. ఇక తల్లి ఫిర్యాదు తో కేసు నమోదు చేసిన పోలీసులు…నిందితుడు సాయిబాబను అరెస్ట్‌ చేశారు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version