యువకుడిని ప్రేమించి..అతని తండ్రితో వెళ్లిపోయిన యువతి..

-

Love: ప్రేమ ప్రవిత్రమైనదే.. కానీ ప్రేమించే వ్యక్తులే కలుషితం అవుతున్నారు.. ఒకప్పుడు ప్రేమకు ఇప్పుడున్న ప్రేమకు ఉన్న అర్థాలు మారిపోయాయి.. ఈరోజుల్లో ప్రేమ అంటే.. పెట్టుబడి అయిపోయింది. ఇప్పుడు జరిగిన ఒక ఘటన చూస్తే..మీరు ముక్కున వేలేసుకుంటారు తెలుసా..? ఆ ఇద్దరు ప్రేమించుకున్నారు.. ఇంట్లో పరిస్థితులు అనుకూలంగా లేకపోతే.. ఆ ప్రేమజంట ఇంట్లోంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకుంటుంది ఇది కామన్‌ కానీ ఆ అమ్మాయి ప్రేమించిన అబ్బాయి తండ్రితో జంప్‌ అయింది.. అంటే వరుసకు మామతో వెళ్లి పెళ్లి చేసుకుని కాపురం కూడా పెట్టింది. మధ్యలో హౌలే అయింది ఇంకెవరో మీకు తెలుసుగా..? అసలు ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..

love

ఉత్తరప్రదేశ్‌ కాన్పూర్‌లో జరిగిన ఈ సంఘటన పోలీసులకే మతిపోయేలా చేసింది. కాన్పూర్‌లోని చకేరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 13 నెలల క్రితం యువతి కనిపించడం లేదని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు.. పోలీసులు ఢిల్లీలో ఉన్న యువతిని పట్టుకున్నారు. విచారించడంతో అసలు విషయం చెప్పింది. తాను ప్రేమించిన వ్యక్తి తండ్రితో అంటే మామతో పారిపోయి పెళ్లి చేసుకొని ఢిల్లీలో కాపురం పెట్టినట్లుగా ఎంక్వైరీలో వెల్లడించింది.

అలా మొదలైంది..

ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్య జిల్లా కంజుసి గ్రామంలో నివాసముంటున్న కమలేష్ కుమార్ వృత్తిరీత్యా తాపీ మేస్త్రీ. 2022లో చకేరి పోలీస్ స్టేషన్‌లో నిర్మాణలను తన కొడుకుతో కలిసి చేశాడు.అదే సమయంలో తన కొడుకు ఆ ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. విషయం తెలిసిన కమలేష్ కుమార్ తన కుమారుడిని మందలించి ఇంట్లో పెట్టి తాళం వేశాడట… ప్రేమించిన అమ్మాయితో కలవకుండా చేశాడు. అయితే తండ్రి నిర్భందించినప్పటికి కమలేష్‌ కుమార్ కొడుకు అమిత్ ప్రేమించిన యువతితో తరచూ ఫోన్‌లో మాట్లాడేవాడు.. తర్వాత వీరిద్దరి పెళ్లికి కమలేష్ అంగీకరించినట్లుగా సమాచారం.

ఇదే సమయంలో 2022 మార్చిలో ఆ యువతి కనిపించకుండా పోయింది. యువతి కుటుంబ సభ్యులు, బంధువులు చాకేరి పోలీస్ స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తిపై కిడ్నాప్ కేసు పెట్టారు. మరోవైపు ప్రేమించిన యువతి అదృశ్యం కాగా, మరోవైపు తండ్రి కూడా కనిపించకుండపోవడంతో అమిత్‌, అతని కుటుంబ సభ్యులు కూడా కమలేష్‌కుమార్ కనిపించడం లేదని మిస్సింగ్ కేసు పెట్టారు. ఈ విషయమై యువతి కుటుంబ సభ్యులు, అమిత్ కుటుంబ సభ్యులు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు.

విడివిడిగా ఫిర్యాదులు నమోదు చేసిన పోలీసులు గత ఏడాది కాలంగా కమలేష్, యువతి ఆచూకీ కనిపెట్టడంలో నానా ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకూ.. వీరిద్దరూ ఢిల్లీలో సహజీవనం చేస్తున్నట్లుగా గుర్తించారు. పోలీసులు రెండ్రోజుల క్రితం కనిపించకుండా పోయిన యువతి ఆచూకి కనుగొన్నారు. ఆమె ఉంటున్న అడ్రస్‌కి వెళ్లి చూడగా..కిడ్నాపైన యువతితో పాటు ఆమె ప్రియుడి తండ్రి ఉండటం చూసి పోలీసులు షాక్‌అయ్యారు.

వీరిద్దరినీ గుర్తించిన పోలీసులు వారిని విచారించగా ఓ ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. తాను కూడా కమలేష్‌ను ప్రేమిస్తున్నానని, అతనితో వెళ్లానని యువతి పోలీసులకు చెప్పిందని ఏసీపీ అమర్‌నాథ్ యాదవ్ వెల్లడించారు. అమిత్ కోసం ఇంటికి తరచూ వచ్చిన సమయంలోనే యువతి అతనితో పాటు కమలేష్‌తోనూ మాట్లాడేది. ఆ పరిచయమే ఇద్దరి మధ్య ప్రేమకు కారణమైందని తెలిపింది. ఆ ప్రేమతోనే ఎవరికి చెప్పకుండా ఢిల్లీకి పారిపోయి కలిసి జీవించేలా చేసిందని ఒప్పుకున్నారు. ఇద్దర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు బాలికను కోర్టులో హాజరుపరచనున్నారు. బాలిక వాంగ్మూలం ఆధారంగా కోర్టు ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version