ఐపీఎల్ 2023: రాజస్థాన్ పక్కా ప్లాన్ తో ధోని సేనతో “ఢీ” !

-

ఐపీఎల్ లో ఈ రోజు సాయంత్రం టేబుల్ టాపర్ చెన్నై సూపర్ కింగ్స్ ను రాజస్థాన్ రాయల్స్ సొంత వేదికపైన ఢీ కొట్టనుంది.ఈ రెండు జట్లు గత మ్యాచ్ లలో చెన్నై కోల్కతా తలపడి గెలవగా , రాజస్థాన్ మాత్రం బెంగుళూరు చేతిలో ఓటమి పాలయింది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ కు గెలవడం చాలా ముఖ్యం, అయితే గత మ్యాచ్ లో ఛేజింగ్ లో ఇబ్బంది పడుతున్న రాజస్థాన్ ఇప్పుడు సరికొత్త ప్లాన్ తో రంగంలోకి దిగనుంది. ముఖ్యంగా ఈ రోజు కనుక ఛేజింగ్ వస్తే బ్యాటింగ్ ఆర్డర్ లో పలు మార్పులు చేసే అవకాశం ఉందట. వరుసగా విఫలం అవుతున్న బట్లర్ ను మిడిల్ ఆర్డర్ లో దించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ లో హోల్డర్ ను మరింత ముందు బ్యాటింగ్ చేసేలాగా జాగ్రత్తలు తీసుకోదలిచారు.

ఎందుకంటే గత మ్యాచ్ లో ఇదే జట్టును దెబ్బ తీసింది. హోల్డర్ చాలా క్వాలిటీ ఆల్ రౌండర్.. మరి ఈ మ్యాచ్ లో చిన్ని గెలిచి వరుసగా నాలుగవ విజయాన్ని సాధిస్తుందా చూడాలి. ఈ రెండు జట్లు తలపడిన మ్యాచ్ లో రాజస్థాన్ 3 పరుగుల తేడాతో గెలిచింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version