మైనర్‌ బాలికతో క్రీడాకారుడి శృంగారం..!

ప్రస్తుత సమాజంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. చిన్నపిల్ల నుండి ముసలి వాళ్ళ వరకు అంత కామాంధుల వికృత చేష్టలకు బలవుతున్నారు. కామాంధులు వారి కామవాంఛ తీర్చుకోవడం కోసం అమ్మాయిల నిండు జీవితాలను బలి తీసుకుంటున్నారు. ఇక ఎదోఒక్క దేశంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఉన్నత స్థాయిలో ఉండి మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తులు కూడా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.

crimpt
crimpt

తాజాగా కెన్యా అథ్లెట్‌, ఒలింపిక్స్‌ గోల్డ్ మెడల్ విన్నర్ కాన్స్‌సలస్‌ కిప్రుటోపై అత్యాచార కేసు నమోదైంది. తనను కిప్రుటోలొంగ తీసుకున్నాడని బాలిక ఫిర్యాదుపై పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. బాధితురాలు ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిందని.. దీంతో కిప్రుటో ఆమెకు ఇంట్లో ఆశ్రయం ఇచ్చినట్లు కెన్యా మీడియాలో పేర్కొంది.

అయితే గతనెలలో 15 ఏళ్ల మైనర్‌ బాలికతో శృంగారం చేశాడనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో పోలీసులు విచారణ జరిపి 25 ఏళ్ల కిప్రుటోను ఈనెల 11న పోలీసులు అరెస్టు చేశారు. కెన్యా లైంగిక నేర నియంత్రణ చట్టాల ప్రకారం 18ఏళ్ల లోపు బాలికతో శృంగారం చేయడం నిషిద్ధం. నేరం రుజువైతే కిప్రుటోకు 20 ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. తాజాగా బెయిల్‌పై జైలు నుంచి విడుదలయైన కిప్రుటో మీడియా కనబడకుండా వెళ్ళిపోయాడు.

ఇక 2016 రియో ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించాడు కిప్రుటో. 3000 మీటర్ స్టీపుల్ ‌ఛేజ్‌ లో పతకం గెలిచాడు. 2017, 2019 వరల్డ్ చాంపియన్‌ షిప్ ‌లను కూడా కైవసం చేసుకున్నాడు. కరోనా వైరస్ నేపథ్యంలో మొనకో వేదికగా ఆగస్టులో జరిగిన డైమండ్ లీగ్ మీట్‌ లో పాల్గోనలేదని పేర్కొన్నారు. ప్రస్తుత కేసు దృష్ట్యా అతను టోక్యో ఒలింపిక్స్‌ లో పాల్గొనడం కూడా అనుమానంగానే కనిపిస్తోందని తెలిపారు.