నిజంగా అసలు నేటి సమాజంలో కొందరు ప్రబుద్ధులు ఎలా ప్రవర్తిస్తున్నారంటే.. అలాంటి వారు చేసే పనులను చెప్పేందుకు కూడా సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తోంది. అలాంటి వికృత చేష్టలకు వారు పాల్పడుతున్నారు. ఇటీవలే హర్యానాలో మెవాత్ జిల్లాలో ఓ మేకపై కొందరు సామూహిక లైంగిక దాడి చేసిన విషయం విదితమే. గతంలోనూ ఓ ప్రబుద్ధుడు కోడిపై అత్యాచారం చేశాడు. ఈ రెండు ఘటనలను ఇంకా మరువక ముందే మరో నీచుడు ఏకంగా ఆవుపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఈ నెల 3వ తేదీన మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లా సుతాలియా అనే ప్రాంతంలో ఓ ఆవుపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సదరు ఆవు స్థానికంగా ఉన్న ఓ వ్యాపారికి చెందినది. దాన్ని పశువుల పాకలో కట్టేసి ఉంచగా, రాత్రి పూట అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి ఆ ఆవుపై అత్యాచారం చేశాడు. దీన్ని ఆ వ్యాపారి గమనించాడు. దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా సదరు ప్రబుద్ధుడి గురించి తెలిసింది. ఆ నీచమైన ఘటనకు పాల్పడ్డ వ్యక్తిని ఛోటేఖాన్‌గా పోలీసులు గుర్తించి అతన్ని అరెస్టు చేశారు. ఈ క్రమంలో విషయం తెలిసిన గ్రామస్తులు ఘటనకు నిరసనగా రాస్తారోకో చేపట్టారు. అనంతరం పోలీసులు కలగజేసుకోవడంతో అంతా సద్దుమణిగింది. కాగా నిందితుడు ఛోటేఖాన్‌ను అరెస్టు చేసిన పోలీసులు అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఏది ఏమైనా ఇలాంటి నీచులను మాత్రం అస్సలు విడిచి పెట్టకూడదు. కఠినంగా శిక్షించాల్సిందే..!