ఆర్మీ జవాన్‌ భార్యతో రాసలీలలు..నగ్నంగా దొరకడంతో !

-

జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణంలో చోటు చేసుకుంది. ఓ సైనికుడి భార్యతో రాసలీలకు పాల్పడ్డాడు ఓ వ్యక్తి. ప్రియుడ్నే భర్తగా పరిచయం చేసి ఇల్లు అద్దెకు తీసుకున్న కిలాడి..అతడితో శృంగారంలో పాల్గొంది. జూబ్లీహిల్స్ రహ్మత్ నగర్ లోని యాదగిరినగర్ లో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. యాదగిరినగర్ లో అద్దె ఇంట్లో ప్రియుడితో రాసలీలలు మొదలు పెట్టింది.

సైనికుడి భర్తతో ఇద్దరు పిల్లలు కలిగాక…పర పురుషుడి మోజులో ఆర్మీ జవాన్ భార్య పడింది. అయితే… అకస్మాత్తుగా ఇంటికొచ్చిన ఆర్మీ జవాన్ మధుసూధన్.. ఇంట్లో తన భార్య పరాయి పురుషుడితో శృంగార కార్యకలాపాలను చూశాడు. భార్యతో పాటు..ఆమె ప్రియుడు జ్ఞానేశ్వర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఆర్మీ జవాన్.. ప్రియుడితో ఉన్న భార్యను ఇంట్లోనే ఉంచి..బయటి నుంచి గడియకు తాళం వేశారు. అనంతరం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు సైనికుడు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news