సంగారెడ్డిలో దారుణం : రోడ్డు ప్ర‌మాదంలో త‌ల్లీకూతురు మృతి

తెలంగాణ లోని సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. శుభ‌కార్యానికి వెళ్లి వ‌స్తున్న కుటుంబానికి ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదం లో త‌ల్లీ కూతురు ఇద్ద‌రూ మృతి చెందారు. అలాగే కుమారుడిగి తీవ్ర గాయాలు అయ్యాయి. వివ‌రాల్లోకి వెళ్తే.. గుమ్మ‌డిద‌ల కు చెందిన బ్ర‌హ్మచారి అనే అత‌ను త‌న కుటుంబం తో ఆదివారం ఒక శుభ‌కార్యానికి వెళ్లాడు. తిరిగి ఇంటి కి వ‌స్తున్న క్ర‌మంలో వారి ద్విచ‌క్ర వాహనం డివైడ‌ర్ కు ఢీ కొట్టింది.

ఈ ప్ర‌మాదం లో త‌ల్లి క‌ల్ప‌న (35) కూతురు శివానీ (4) మృతి చెందారు. అలాగే రెండేళ్ల కార్తీక్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. అలాగే బ్ర‌హ్మ‌చారి కి స్వ‌ల్పం గా గాయాలు అయ్యాయి. స‌మాచారం తెలుసుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థాలానికి చేరుకున్నారు. కార్తీక్, బ్ర‌హ్మ‌చారి ని చికిత్స కోసం ఆస్ప‌త్రికి పంపించారు. అలాగే మృతి చెందిన త‌ల్లీ కూతురి పోస్టుమార్టం కోసం జిల్లా ప్రభుత్వ ఆస్ప‌త్రికి పంపంచారు.