ఇండియన్ రైల్వేస్ ప్రయాణికులకు సరికొత్త ఆఫర్స్ ని తీసుకొస్తోంది. ప్రీమియం రైళ్లలో ప్రయాణికుల కోసం విమానాల మాదిరి సర్వీస్ ని తీసుకురానున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే… గతిమాన్, తేజస్ ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లలో రైలు హోస్టెస్‌సు త్వరలోనే నియమించాలని ఇండియన్ రైల్వేస్ అంటోంది.
రైళ్లలో కూడా విమానాల మాదిరి సర్వీసులు అందుబాటులోకి రాబోతున్నాయి. రైళ్లలో హోస్టెస్‌లను నియమించడంతో, ప్రయాణికులకు మెరుగైన సర్వీసులను అందజేయాలని ఇండియన్ రైల్వేస్ అంటోంది. కేవలం మహిళలు మాత్రమే కాక, పురుషులు కూడా వీళ్లల్లో వున్నారు. అయితే ఈ ఫెసిలిటీని ప్రీమియం రైళ్లకు మాత్రమే తీసుకు రానున్నారు.
మనం విమానాల్లో చూసినట్టు రైల్వేలో కూడా ఈ హోస్టెస్‌లు ప్రయాణికులకు స్వాగతం చెప్పడం, ఆహారం అందించడం వంటి సేవలనిస్తారు. ఈ సేవలకు నియమితులయ్యే మహిళా హోస్టెస్‌కు పగటి పూట మాత్రమే డ్యూటీలు వేయనున్నారు.
ఇప్పటికే వందే భారత్‌లో మహిళా హోస్టెస్‌లను నియమించారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం భారతీయ రైల్వే 25 ప్రీమియం రైళ్లను నడుపుతోంది. ఈ రైళ్లలో 12 శతాబ్ది, ఒకటి గతిమాన్, రెండు వందే భారత్, ఒకటి తేజస్ ఎక్స్‌ప్రెస్ ఉన్నాయి.