తాగి వచ్చి భార్యను కొట్టాడు, భార్య తిరిగి కొట్టింది, తర్వాత

మద్యం మత్తులో కొందరి ప్రవర్తనపై ఆందోళన కలుగుతూ ఉంటుంది. ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి దాడులు చేస్తూ ఉంటారు. తల్లి పిల్లా అనే తేడా లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. తాజాగా అనంతపురం జిల్లాలో ఒక ఘటన జరిగింది. కళ్యాణదుర్గం మున్సిపల్ పరిధిలోని దొడగట్ట గ్రామంలో భర్తను ఒక భార్య హతమార్చింది. మద్యం మత్తులో నిన్న రాత్రి భార్యతో గొడవపడిన నల్లబోతుల శ్రీనివాసులు…

crime
crime

ఆమెపై చేయి కూడా చేసుకున్నాడు. దీనితో పట్టరాని ఆవేశంతో భర్తను కట్టెతో కొట్టింది భార్య సరిత. ఆమె తిరిగి కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లి మృతి చెందాడు శ్రీనివాసులు. శ్రీనివాసులు తల్లి ఫిర్యాదు మేరకు భార్య సరిత ను అదుపులోకి తీసుకున్న పోలీసులు… కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరి మధ్య గత కొన్ని రోజులుగా విభేదాలు ఉన్నాయని స్థానికులు చెప్పారు.