మనుషులను చంపే పులిని పట్టుకోవడం చేసిన ఆపరేషన్ లో ఓ మహిళ బలయిపోయింది. ఈ ఘటన మహారాష్ట్రలోని యావత్మల్ లో చోటు చేసుకున్నది.
యావత్మల్ ఏరియాలో ఓ ఆడపులి, దాని రెండు పిల్లలు తిరుగుతున్నాయని.. ఆ ఆడ పులి ఇప్పటి వరకు ఆరుగురికి చంపేసిందని దాన్ని ఎలాగైనా పట్టుకోవాలని సుప్రీం కోర్టు అటవీ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆ పులి ఆచూకీ కోసం ఐదు ఏనుగులను రంగంలోకి దించారు పోలీసులు. అందులో గిరిరాజ్ అనే ఓ మగ ఏనుగు గొలుసులు తెంచుకొని అక్కడి నుంచి పారిపోయింది. దీంతో అధికారులు దాన్ని పట్టుకోలేక నానా అవస్థలు పడ్డారు. అలా పారిపోతూ రాలేగావ్ కు చెందిన ఓ మహిళను తొండంతో కొట్టి చంపింది. మరో వ్యక్తికి గాయపరిచింది. చివరకు దాన్ని ఎలాగోలా పట్టుకొని నిర్బంధించగలిగారు అధికారులు. ఒక పని కోసం వస్తే మరేదో పని పడిందని.. అసలు విషయం వదిలేసి ఈ ఏనుగును పట్టుకోవడం కోసమే తిరగడం జరిగిందని అధికారులు వాపోయారు. మొత్తం 200 మంది పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది కలిసి అడవి అంతా వెతికినా ఆ ఆడపులి జాడ మాత్రం తెలియరాలేదట. ఎక్కడ దాక్కుందో దొంగ పులి.
One of the elephants that was being employed to catch the man eater tigress of Yavatmal and her two cubs freed himself from the base camp and ran amok killing a woman at Chahand village in Ralegao tahsil on early morning of Wednesday. pic.twitter.com/LANvvmVjZB
— The Indian Express (@IndianExpress) October 3, 2018