వ‌రి ధాన్యం : ఆగిన రైతు గుండె

-

తెలంగాణ రాష్ట్రం లో ని కామారెడ్డి జిల్లా లో దారుణం చోటు చేసుకుంది. ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతు గుండె ఆగింది. వ‌రి ధాన్యం కొనుగోలు జాప్యం జ‌రుగుతుడ‌టం తో రైతు కు గుండె పోటు వ‌చ్చింది. దీంతో రైతు మృతి చెందాడు. ఈ ఘ‌ట‌న కామారెడ్డి జిల్లా లోని వ‌డ్లూర్ ఎల్లారెడ్డి లో జ‌రిగింది. రాజ‌య్య (48) అనే రైతు వ‌డ్లూర్ ఎల్లా రెడ్డి గ్రామంలో నివాసం ఉంటున్నాడు.

త‌న కు ఉన్న పొలం వ‌రి పంట వేశాడు. ఆ ధాన్యాన్ని అదే గ్రామం లో ఉన్న‌ కొనుగోలు కేంద్రానికి తీసుకువ‌చ్చాడు. మూడు రోజుల అయినా.. త‌న వ‌రి ధాన్యం కొనుగోలు చేయ‌లేదు. రాత్రి ప‌గులు అక్క‌డే ఉండి త‌న వ‌రి ధాన్యాన్ని కొనుగోలు చేస్తారా అని ప‌డి గాపులు కాశాడు. అయితే గురు వారం సాయంత్రం రైతు రాజ‌య్య కు వ‌రి ధాన్యం కొనుగోలు కేంద్రంలో నే గుండె పోటు వ‌చ్చింది. దీంతో తొటి రైతులు ఆస్ప‌త్రి కి తీసుకెళ్లే లో పే రైతు రాజ‌య్య మృతి చెందాడు. అయితే ధాన్యం కొనుగోలు ప్ర‌భుత్వం జాప్యం చేస్తుంద‌ని.. అందువ‌ల్లే రైతు రాజ‌య్య మృతి చెందాడ‌ని గ్రామ‌స్తులు ఆందోళ‌న చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version