టొరెంటోలోని అపార్ట్‌మెంట్‌లో కాల్పులు.. ఐదుగురి దుర్మరణం

-

కెనడా టొరెంటోలోని ఓ అపార్ట్‌మెంట్‌లో సాయుధుడు విచ్చలవిడిగా కాల్పులకు తెగబడటంతో ఐదుగురు దుర్మరణం చెందారు. టొరెంటోకు దాదాపు 30 కిలోమీటర్ల దూరంలోని వుఘాన్‌ అనే ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.  నిందితుడు కూడా పోలీసు కాల్పుల్లో చనిపోయినట్లు సమాచారం. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మృతులకు నిందితుడికి ఉన్న సంబంధంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సాయంత్రం 7.20 సమయంలో వుఘాన్‌ వద్ద ఓ దుండగుడు కాల్పులు జరుపుతున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చిందని యోర్క్‌ పోలీస్‌ చీఫ్ జిమ్‌ మాక్‌స్వెన్‌  వెల్లడించారు.  తమ అధికారి అక్కడకు చేరుకొనే సరికే పరిస్థితి భయంకరంగా ఉందని పేర్కొన్నారు. అక్కడ భవనంలోని చాలా ఫ్లాట్లలో రక్తమోడుతున్న మృతదేహాలు కనిపించాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో పోలీసులు నిందితుడికి మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో హంతకుడు కూడా మరణించాడు. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడు అదే అపార్ట్‌మెంట్‌కు చెందినవాడా.. బయట వ్యక్తా అనే తెలియాల్సి ఉంది.

కుటుంబ సభ్యుల ధ్రువీకరణ లేకుండా మరణించిన వ్యక్తుల వివరాలు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు. ఈ అపార్ట్‌మెంట్‌ భవనం నుంచి ప్రజలను బయటకు పంపించిన పోలీసులు.. మరెవరైనా నిందితులు దానిలో ఉన్నారా అనే విషయంపై క్షుణ్ణంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇక కాల్పులకు గల కారణాలు తెలియరాలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version