విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం.. ఇద్దరు సైబర్ కేటుగాళ్లు అరెస్ట్

-

నిరుద్యోగుల ఆశను పెట్టుబడిగా చేసుకొని కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. సమాజంలో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు, మీడియా ఎన్ని రకాలుగా అవగాహన కల్పిస్తున్నా నిరుద్యోగులు మోసపోతూనే ఉన్నారు. ఉద్యోగం పేరిట డబ్బులు వసూలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి హైదరాబాదులో చోటు చేసుకుంది. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ హైదరాబాద్ కి చెందిన వ్యక్తి నుండి భారీ మొత్తంలో నగదు కాజేశారు కేటుగాళ్లు.

యూఏఈ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉద్యోగం ఇప్పిస్తామని హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి నుండి 1 లక్ష 90 వేల రూపాయలు కాజేశారు సైబర్ కేటుగాళ్లు. ఢిల్లీ కాల్ సెంటర్ కి చెందిన ఈ సైబర్ కేటుగాలను అరెస్టు చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. ఈ కాల్ సెంటర్ కి చెందిన ప్రధాన నిందితులు సుదాన్ష్, శేఖర్, మహంతి, పునీత్ గుప్తా లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version