550 మందికి తండ్రయ్యాడు.. రూ. 90 లక్షలు జరిమానా వేసిన కోర్టు

-

Unborn child: పిల్లలు పుట్టని సంతానం ఈరోజుల్లో చాలా ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు. అందులో ఒకటి స్పెర్మ్‌ డొనేట్‌ చేయడం కూడా.. అయితే కొన్ని చోట్ల చట్ట విరుద్ధం.. కొన్ని చోట్ల నిషేధం కూడా.. ఒక వ్యక్తి స్పెర్మ్‌ డొనేట్‌ చేయడం ద్వారా 550 మందికి పైగా పిల్లలకు తండ్రయ్యాడు. స్పెర్మ్ డొనేషన్ ద్వారా 550 మందికి పైగా పిల్లలకు తండ్రయిన వ్యక్తికి స్పెర్మ్ దానం చేయకుండా డచ్ కోర్టు నిషేధం విధించింది. 41 ఏళ్ల జోనాథన్ జాకబ్ మీజర్ స్పెర్మ్ దానం చేయకుండా కోర్టు నిషేధం విధించింది. నిషేధాన్ని ఉల్లంఘించినందుకు స్పెర్మ్ డొనేషన్ 100,000 యూరోల (రూ. 90,41,657) కంటే ఎక్కువ జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.

 

Unborn child

పిల్లల్లో ఒకరి తల్లి ఒక సంస్థ అతనిపై ఫిర్యాదు చేయడంతో కేసు గురించి షాకింగ్ సమాచారం వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకు స్పెర్మ్ డొనేషన్ ద్వారా పుట్టిన పిల్లల సంఖ్యపై జోనాథన్ తన తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించాడని కోర్టులో వెల్లడైంది. తమ కుటుంబంలోని పిల్లలు వందలాది మంది తోబుట్టువులతో కూడిన పెద్ద బంధుత్వ నెట్‌వర్క్‌లో భాగమనే వాస్తవాన్ని తల్లిదండ్రులు గుర్తించినట్లు.. న్యాయమూర్తి హెస్సెలింక్ తెలిపారు..

ఈ కాలంలో జోనాథన్ తన స్పెర్మ్‌ను 13 క్లినిక్‌లకు దానం చేశారు. వీటిలో 11 నెదర్లాండ్స్‌లో ఉన్నాయి. డచ్ క్లినికల్ మార్గదర్శకాలు స్పెర్మ్ దాతలు 12 కంటే ఎక్కువ మంది మహిళలకు లేదా తండ్రి 25 కంటే ఎక్కువ మందికి స్పెర్మ్‌ను దానం చేయకూడదని రూల్స్‌ ఉన్నాయి.. వందలాది మంది తోబుట్టువులు ఉన్నారని తెలిసి భవిష్యత్తులో పిల్లలు కలత చెందకుండా, మానసిక సమస్యలు రాకుండా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. 2007లో స్పెర్మ్‌ను దానం చేయడం ప్రారంభించినప్పటి నుంచి 550 నుంచి 600 మంది పిల్లలు పుట్టడంలో ఆయన సహకరించారని, విరాళం ఇవ్వడం మానేయకుండా విదేశాల్లో, ఆన్‌లైన్‌లో స్పెర్మ్ డొనేట్ చేసినట్లు వార్తలు వచ్చాయి.

అయితే గర్భం దాల్చలేని తల్లిదండ్రులకు సాయం చేయాలని దాత తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వృత్తిరీత్యా సంగీతకారుడు, జోనాథన్ ప్రస్తుతం కెన్యాలో నివసిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version