ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టివేత

-

మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు అడ్డగా మారుతున్నాయి విమానాశ్రయాలు. ఇటీవలి కాలంలో దేశంలో పలు విమానాశ్రయాలలో అక్రమంగా ఇండియాలోకి తీసుకు వస్తున్న డ్రగ్స్ ను పట్టుకుంటున్నారు కస్టమ్స్ అధికారులు. తాజాగా ఇలాంటి మరో ఘటన ఢిల్లీ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీ ఎత్తున డ్రగ్స్ ని పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు.

40 కోట్ల విలువ చేసే 4 వేల గ్రామాల హెరాయిన్ ని సీజ్ చేశారు అధికారులు. హెరాయిన్ ను ట్రాలీ కింది భాగంలో దాచి తరలించే యత్నం చేసింది కిలాడీ లేడి. ఆ లేడీ వ్యవహార శైలి పసిగట్టి అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ బృందం.. ట్రాలీ బ్యాగ్ కింది భాగంలో దాచిన హెరాయిన్ ని గుట్టురట్టు చేశారు. నైజీరియా లేడీ పై ఎన్డి.పి.ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version