ఇండియాలోని మహిళలపై అఘాయిత్యాలు ఏ మాత్రం తగ్గడం లేదు. దేశంలోని ఏదో ఓ మూలన మహిళలపై లైంగిక దాడులు చోటు చేసుకుంటున్నాయి. ఇక తాజాగా 7 ఏళ్ల బాలికపై హిజ్రా లైంగిక దాడి చేసింది. ఈ దారుణమైన సంఘటన ఉత్తర ప్రదేశ్ లోని బరేలీలో చోటు చేసుకుంది.
లైంగిక దాడి విషయం ఎవరికైనా చెబితే.. చంపేస్తానని బాలికను హిజ్రా బెదిరింపులకు గురి చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు ఫోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. బాధితురాలి ఇంటికి సమీపంలోనే రజియా అనే హిజ్రా నివసిస్తోంది.
పక్కింట్లో టీవీ చూస్తున్న సమయంలో.. బాలిక దగ్గరికి వెళ్లి ఆమెను తీసుకెళ్లింది. బాలికపై హిజ్రా లైంగిక దాడి చేసింది. మార్చి 29 వ తేదీన ఈ సంఘటన చోటు చేసుకోగా.. బాధిత బాలిక..హిజ్రాకు భయపడి చెప్పలేదు. కానీ ఇటీవల బాలిక తీవ్ర కడుపు నొప్పితో బాధపడింది. దీంతో అసలు విషయం బయట పడింది. ప్రస్తుతం ఆ హిజ్రా పరారీలో ఉంది.