దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన లఖింపుర్ ఖేరీ హింసాత్మక ఘటనలో ప్రధాన నిందితుడు అయిన ఆశిష్ మిశ్రా జైలు నుంచి విడుదల అయ్యాడు. కాగ ఆశిష్ మిశ్రా… కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడని తెలిసిందే. కాగ ఆశిష్ మిశ్రాకు గత వారం గురు వారమే అలహాబాద్ హై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ. 3 లక్షల చొప్పున ఇద్దరి పూచీ కత్తు తో అలహాబాద్ హై కోర్టు ఆశిష్ మిశ్రాకు బెయిల్ మంజూరు చేసింది. కాగ బెయిల్ కు సంబంధించిన ప్రక్రియ ముగిసిన తర్వాత మంగళ వారం సాయంత్రం ఆశిష్ మిశ్రా జైలు నుంచి విడుదల అయ్యాడు.
కాగ గత ఏడాది సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తున్న సమయంలో.. ఆశిష్ మిశ్రా తన కారుతో రైతులపైకి తీసుకెళ్లారు. ఈ ఘటనలో నలుగురు రైతులు మృతి చెందారు. అనంతరం జరిగిన ఘర్షణలో మరో నలుగురు రైతులు మృతి చెందారు. దీనికి ప్రధాన నిందితుడిగా కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ఉన్నాడు. దీంతో గత ఏడాదే అక్టోబర్ నెలలో ఆశిష్ మిశ్రాను పోలీసులు అరెస్టు చేశారు. కాగ అప్పటి నుంచి ఆశిష్ మిశ్రాకు బెయిల్ రాలేదు. కాగ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ప్రారంభం అయిన సందర్భంలోనే ఆశిష్ మిశ్రాకు బెయిల్ మంజూర్ కావడం విశేషం.