జమ్మూ కాశ్మీర్ మరో సారి ఉలిక్కి పడింది. భూకంపంతో జనాలు భయాందోళనకు గురయ్యారు. బుధవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. బుధవారం రోజు ఉదయం 5.30 గంటలకు భూకంపం సంభవించినట్లుగా నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. రిక్టర్ స్కేల్ పై 3.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. పహల్గామ్ కు దక్షిణ నైరుతి దిశలో 15 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదైంది. ఈ భూకంపం వల్ల పెద్దగా ఆస్తి, ప్రాణ నష్టాలు జరగలేదు.
అంతకుముందు ఫిబ్రవరి 5న.. జమ్మూ కాశ్మీర్ లోె శక్తి వంతమైన భూకంపం వచ్చింది. ఆఫ్గాన్ సరిహద్దుల్లో సంభవించిన భూకంప తీవ్రత జమ్మూ కాశ్మీర్ లోనూ కనిపించింది. రిక్టర్ స్కేల్ పై 5.7 తీవ్రతతో ఆ సమయంలో భూకంపం సంభవించింది. దీని ప్రకంపనలు హర్యానా, ఢిల్లీలో కూడా కనిపించాయి. ఆ సమయంలో కాశ్మీర్ బుద్గాగాం జిల్లాలోని చ్రార్-ఎ-షరీఫ్ వద్ద ఉన్న ప్రసిద్ధ సూఫీ సెయింట్ యొక్క మినార్ వంగిపోయింది