మెట్రో ట్రెయిన్ లో యువతులను సీక్రెట్ గా వీడియో తీసి..!

-

man arrested for filming young girls in chennai metro train

మహిళలకు ఎక్కడా రక్షణ లేకుండా పోతున్నది అనడానికి ఈ ఘటనే ఉదాహరణ. కొంతమంది యువతులు కొయంబెడు నుంచి చెన్నై ఎయిర్ పోర్ట్ వెళ్లేందుకు మెట్రో రైలు ఎక్కారు. వాళ్లు కూర్చున్న సీటుకు ఎదురుగా మరో వ్యక్తి కూర్చున్నాడు. అతడి వయసు 45 వరకు ఉంటుంది. తన జేబులో నుంచి మొబైల్ తీసి వాళ్ల వీడియో, ఫోటోలు తీయడం మొదలు పెట్టాడు. అతడు తమ ఫోటోలు, వీడియోలు తీస్తున్నాడని అనుమానం వచ్చిన యువతులు పరీక్షించి చూడటంతో మెట్రో గ్లాస్ లోనూ అతడు వీడియో తీస్తున్న సంగతి వాళ్లకు తెలిసిపోయింది.

దీంతో ఎందుకు తమ ఫోటోలు, వీడియోలు మొబైల్ లో షూట్ చేస్తున్నావంటూ నిలదీశారు ఆ యువతులు. మీరు పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకున్నారు.. అందుకే ఫోటోలు తీశాను.. అంటూ సమాధానమిచ్చాడు ఆ వ్యక్తి. దీంతో షాకయిన ఆ యువతులు.. మెట్రో కంట్రోల్ రూంకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి.. ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్ లో ఆ యువతుల ఫోటోలు, వీడియోలు లభ్యమయ్యాయి. వాటిని పోలీసులు వెంటనే డిలీట్ చేయడంతో ఆ యువతులు ఊపిరి పీల్చుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news