కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రామ్ చరణ్ భార్య ఉపాసన బంధువులే. ఆమెకు కొండా.. బాబాయ్ వరుస అవుతాడు. సరే.. బంధుత్వం పక్కన బెడితే.. ఆమె కొండాపై పోటీ చేస్తున్నట్టు ఈమధ్య వార్తలొచ్చాయి. కొండా విశ్వేశ్వర్ రెడ్డి… తెలంగాణ ఉద్యమం సమయంలో టీఆర్ఎస్ లో చేరి.. ఉద్యమంలో పాల్గొని 2014 లో చేవెళ్ల నుంచి టీఆర్ఎస్ పార్టీ తరుపున ఎంపీగా గెలిచిన సంగతి తెలిసిందే. తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు.
లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఆయనే చేవెళ్ల ఎంపీగా పోటీ చేయనున్న సందర్భంగా… టీఆర్ఎస్ నుంచి మంచి పలుకుబడి ఉన్నవాళ్లను నిలబెట్టాలని టీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నట్టు వార్తలొచ్చాయి. అందుకే.. ఉపాసనను చేవెళ్ల ఎంపీగా టీఆర్ఎస్ తరుపున నిలబెట్టాలని పార్టీ అధినాయకత్వం నిర్ణయించిందని సోషల్ మీడియా కోడై కూసింది.
వాటన్నింటికీ చెక్ పెట్టింది ఉపాసన. అదంతా ఉత్తుత్తి ప్రచారం అని.. ఆ ప్రచారం ఏమాత్రం నిజం లేదని సోషల్ మీడియా వేదికగా స్పందించింది ఉపాసన. ప్రస్తుతం నేను నా పనిని ప్రేమిస్తున్నా. విశ్వేశ్వర్ రెడ్డి భార్య సంగీతా రెడ్డి నా బాస్.. బాబాయ్ చేవెళ్లకు ఎంతో చేస్తున్నారు.. అంటూ తనపై వస్తున్న పుకారుకు ఫుల్ స్టాప్ పెట్టింది ఉపాసన.