సన్నితో స్టెప్పులేస్తున్న మెగాస్టార్..!

-

పోర్న్ స్టార్ నుండి బాలీవుడ్ క్రేజీ స్టార్ గా మారిన సన్ని లియోన్ వరుస సక్సెస్ లతో దూసుకెళ్తుంది. ఇన్నాళ్లు బాలీవుడ్ లో తన సత్తా చాటిన ఈ అమ్మడు ఇప్పుడు సౌత్ సినిమాల మీద కన్నేసింది. తెలుగులో ఇప్పటికే మంచు మనోజ్ కరెంటు తీగ, రాజశేఖర్ పిఎస్వి గరుడవేగ సినిమాతో సత్తా చాటింది. ఇక ఇప్పుడు సన్ని మళయాళంలో నటించడానికి రెడీ అయ్యింది. మళయాళ మెగాస్టార్ మోహన్ లాల్ హీరోగా నటిస్తున్న మధుర రాజా సినిమాలో సన్ని లియోన్ ఆడి పాడుతుంది.

2016లో వచ్చిన పోకిరి రాజా సినిమా సీక్వల్ గా వస్తున్న ఈ సినిమాలో మమ్ముట్టితో పాటుగా సన్ని లియోన్ స్పెషల్ సాంగ్ లో నర్తిస్తుంది. ఈ సాంగ్ షూట్ లో భాగంగా దిగిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మమ్ముట్టి తెలుగులో యాత్ర సినిమాలో నటించారు. వై.ఎస్ బయోపిక్ గా వస్తున్న ఈ సినిమాను మహి వి రాఘవ్ డైరెక్ట్ చేయగా విజయ్ చిల్లా, శషి దేవి రెడ్డి నిర్మిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news