హైదరాబాద్ లో మరో గ్యాంగ్ రేప్.. 14 ఏండ్ల బాలికపై అఘాయిత్యం

హైదరాబాద్‌ లో మరో గ్యాంగ్‌ రేప్‌ వెలుగులోకి వచ్చింది. పాతబస్తీకి చాంద్రాయాణ్‌ గుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధికి చెందిన 14 ఏళ్ల బాలిక ఈ నెల 17న రాత్రి తల్లితో గొడవ పడి బయటకు వచ్చింది. 2 కి మీ దూరంలోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. అక్కడి నుంచి తిరిగి తన ఇంటికి వెళుతున్న సమయంలో ఆటోలోని నలుగురు యువకులు ఒంటరిగా ఉన్న ఆ బాలికతో మాటలు కలిపారు.

బండ్ల గూడ నుంచి ఆరంఘర్‌..మేడిపట్నం.. తిప్పుతూ అనంతరం కిడ్నాప్‌ చేసి..గ్యాంగ్‌ రేప్‌ నకు పాల్పడ్డారు. మరుసటి రోజున ఇంటికి చేరుకున్న బాలిక జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో వారు చాంద్రాయణ గుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాలికను భరోసా సెంటర్‌ కు తరలించారు. దీంతో ఆ నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసారు. ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.