భగీరథకు మంగళం.. పైసలు ఇస్తేనే పానీ..

-

బంగారు తెలంగాణ అని సీఎం కెసీఆర్ ఏవేవో చెప్పాడు..ఆ పథకాలు, ఈ పనులు అన్నారు చివరికి మొండి చెయ్యి చూపించాడు.అమలులో ఉన్న పథకాలను కూడా తీసేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న అన్నీ పథకాలకు ఆల్రెడీ మంగళం పాడేసారు.మిషన్ భగీరథ కింద రాష్ట్రమంతా ఉచితంగా తాగునీళ్లు అందజేస్తున్నామని సీఎం కేసీఆర్ సహా రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు బహిరంగంగా ప్రకటిస్తున్నా ఎక్కడా ఫ్రీగా ఇవ్వడం లేదు..

గ్రామాల్లో ఏడాదికి సంబంధించిన నల్లా బిల్లు మొత్తం ఒకేసారి వసూలు చేస్తున్నారు. కొన్నిచోట్ల ప్రతి ఆరు నెలల బిల్లు చెల్లించాలని చెప్తున్నారు. నీటి పన్ను కింద ఈ ఆరు నెలల కాలానికి రూ. 480 చొప్పున వసూలు చేశారు. మిషన్​ భగీరథ నీళ్లు ఉచితమే అంటే.. ప్రస్తుతం ప్రభుత్వం నుంచి నయాపైసా రావడం లేదని, నీటి పన్నులు వసూలు చేస్తామని పంచాయతీ కార్యదర్శులు స్పష్టం చేస్తున్నారు. దీనిపై పంచాయతీ రాజ్​ శాఖ స్టేట్​ అధికారి మాట్లాడుతూ, ప్రభుత్వం నుంచి తమకు అధికారికంగా ఎలాంటి ఆదేశాలు లేవని, ఉచిత నీటిని ఇవ్వలేమని, నీటి పన్నులు వసూలు చేయాల్సిందేనని ఆదేశించామని వెల్లడించారు.
ఇప్పటికే రాష్ట్రంలో పించన్ల కోత విధించారు.పింఛన్లలో నీటి పనులు, ఇంటి పన్నులు మినహాయించుకుని మిగిలిన సొమ్ము ఇస్తున్నారు. చాలా గ్రామాల్లో దీనిపై గొడవలకు దిగుతున్నా.. పంచాయతీ కార్యదర్శులు ససేమిరా ఒప్పుకోవడం లేదు.ఇకపోతే నల్లా బిల్లు కట్టకుంటే కనెక్షన్ కట్​చేస్తామని హెచ్చరిస్తున్నారు. మైనర్​పంచాయతీల్లో ప్రతినెలా రూ.50 నుంచి రూ.80, మేజర్ పంచాయతీల్లో రూ.100 నుంచి రూ. 130, మున్సిపాలిటీల్లో రూ.100 నుంచి రూ. 200 వరకు వాటర్ టాక్స్​వేస్తున్నారు. ఇలా రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ఏడాదికి కనీసం రూ. 580 నుంచి రూ. 1,200 దాకా నల్లా బిల్లులు కట్టించుకుంటున్నారు.

భగీరథ నీళ్ల పథకంలో ఇస్తున్నామని చెప్తూ ఈ బిల్లును ఏకంగా రూ. 100 వరకు పెంచారు. కొన్నిచోట్ల పాత పథకాల ద్వారానే నల్లాల నీళ్లు ఇస్తున్నా.. బిల్లులు మాత్రం ఎక్కువ వేస్తున్నారు. పల్లె ప్రగతి కింద పంచాయతీలకు ఎంతో కొంత ఇస్తున్నా.. అవన్నీ కరెంట్​ బిల్లులు, మల్టీపర్పస్​వర్కర్ల వేతనాలకే సరిపోతున్నాయి. ఇంకా ట్రాక్టర్ల ఈఎంఐ, డీజిల్​ఖర్చులు పంచాయతీలు భరించుకోవాల్సి వస్తోంది..ఇలా చూసుకుంటే మొత్తం ప్రజల నుంచి వసూల్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రజలు కెసీఆర్ ప్రభుత్వం పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు..వచ్చే ఎన్నికల్లో తెరాస ప్రభుత్వానికి చుక్కెదురు అయ్యేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news