500 మందికి పైగా ఎయిడ్స్ వ్యాధిని అంట‌గ‌డ్డాడు..

-

గ్రామస్తులందరికీ ఎయిడ్స్ మహమ్మారిని ఎక్కించిన ఆ డాక్టర్‌ను ఉరి తీయాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. టెస్టుల తర్వాత మొత్తం ఎంతమందికి ఈ వ్యాధి సోకిందనే సంఖ్య తెలుస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.

ఓ డాక్టర్.. కక్కుర్తి పడ్డాడు. కొత్త సిరంజీ కొనలేక.. పాత సిరంజీనే వాడి ఏకంగా 500 మందికి పైగా ఎయిడ్స్‌ను అంటగట్టాడు. ఈ ఘటన దక్షిణ పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో చోటు చేసుకున్నది. వసాయో అనే గ్రామం ప్రస్తుతం ఎయిడ్స్ అంటే చాలు వణికిపోతున్నది. దానికి కారణం ఓ డాక్టర్. ఇప్పటికే ఆ ఊళ్లో 500 మందికి పైగా ఎయిడ్స్ సోకింది. ఇంకా ఎవరెవరికి సోకిందోనని ఆ ఊరి వాళ్లంతా టెన్షన్ పడుతున్నారు.

హెచ్‌ఐవీ వ్యాధి సోకిన.. ఓ వ్యక్తికి వాడిన సిరంజీనే ఆ డాక్టర్ వందల మందికి వాడాడు. అదే సిరంజీతో ఇంజెక్షన్లు చేశాడు. దీంతో 500 మందికి పైగా ఎయిడ్స్ సోకింది. ఈ ఘటన వైద్యాధికారులకు తెలియడంతో ఆ ఊళ్లో క్యాంప్ పెట్టి.. అందరికీ హెచ్‌ఐవీ టెస్టులను నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 500 మందికి దాకా హెచ్‌ఐవీ పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. వారిలో చాలామంది చిన్నారులున్నారు. గ్రామస్తులందరికీ ఎయిడ్స్ మహమ్మారిని ఎక్కించిన ఆ డాక్టర్‌ను ఉరి తీయాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. టెస్టుల తర్వాత మొత్తం ఎంతమందికి ఈ వ్యాధి సోకిందనే సంఖ్య తెలుస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.

ఎయిడ్స్ మహమ్మారి గురించి ఆ గ్రామ ప్రజలకు ఏం తెలియదు. ఆ ఊరు చాలా వెనుకబడిన గ్రామం. అందుకే.. ఆ డాక్టర్ ఆగడాలు అక్కడ నడిచాయి. సాధారణంగా ఎయిడ్స్ వ్యాధి సోకితే దాన్ని నయం చేయడానికి మందులు అంటూ ఏవీ ఉండవు. కానీ.. దాన్ని పెరగకుండా కంట్రోల్ చేసే మందులు అందుబాటులో ఉంటాయి. కాకపోతే.. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు 10 నుంచి 15 ఏళ్లలో వ్యాధి ముదిరి చనిపోతారు. ఆసియాలో ఎయిడ్స్ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతున్న దేశాల్లో పాకిస్థాన్ రెండో స్థానంలో ఉంది. అసురక్షిత శృంగారం వల్ల కాకున్నా.. నకిలీ డాక్టర్ల వల్ల, కలుషిత సిరంజీల వల్ల, సరిగ్గా శుభ్రం చేయని వైద్య పరికరాల వల్ల పాకిస్థాన్‌లో ఎయిడ్స్ వ్యాధి విజృంభిస్తోందట.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version