నైట్రోజన్ గ్యాస్ పీల్చుకొని తల్లీకూతురు ఆత్మహత్య..!

-

ఆత్మహత్య కోసం కొత్త పద్ధతులు వెతుకున్నారు నేటి జనం. మామూలుగా ఉరివేసుకోవడమో… బిల్డింగ్ మీది నుంచి దూకడమో.. ఏదైనా విషం తాగి ఆత్మహత్య చేసుకుంటారు చాలామంది. కానీ.. సికింద్రాబాద్ లోని మెట్టుగూడకు చెందిన 38 ఏళ్ల ఆర్తి మాత్రం నైట్రోజన్ గ్యాస్ ను పీల్చుకొని ఆత్మహత్య చేసుకున్నది. తను ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తన ఏడేళ్ల కూతురు తషీ నైట్రోజన్ గ్యాస్ పీల్చేలా చేసి చంపేసింది. ఆ తర్వాత తను నైట్రోజన్ ను పీల్చుకొని ఆత్మహత్య చేసుకున్నది. దీంతో ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

మెట్టుగూడకు చెందిన సిద్ధార్థ్ అనే వ్యక్తిని ఆర్తి లవ్ మ్యారేజ్ చేసుకుంది. వాళ్లకు తషీ అనే కూతురు ఉంది. సిద్ధార్థ్ బిజినెస్ చేస్తుండేవాడు. ఆయన గత కొన్ని రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. అప్పటి నుంచి భర్తనే తలుచుకుంటూ.. తనలో తాను కుమిలిపోతూ బతికింది ఆర్తి. పుట్టింటికి కూడా వెళ్లలేదు. అత్తగారింట్లోనే ఉంటూ.. ఎప్పుడూ భర్త జ్హాపకాలతోనే బతికేది. ఓ పది రోజుల క్రితం నైట్రోజన్ సిలిండర్ ను ఆన్ లైన్ లో బుక్ చేసింది ఆర్తి. శుక్రవారం రోజు తన అత్త, మరిది బయటికి వెళ్లగా ముందుగా కూతురు ముఖానికి ప్లాస్టిక్ కవర్ తొడిగి.. పైపు ద్వారా నైట్రోజన్ ను పంపించి చంపేసింది. తర్వాత తను కూడా అలాగే తలకు కవర్ కట్టుకొని గ్యాస్ ను పీల్చుకొని చనిపోయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version