కూతూరి తలనరికి అదే తలతో స్టేషన్‌కి..

-

కులాలు, మతాల పిచ్చితో మానవత్వాలు మంటగలుస్తున్నాయి. ఇతర కూలానికి చెందిన వ్యక్తితో వివాహం చేసుకుందని కొందరు.. తమ ఆచారంలో ఇలాంటి లేవని మరికొందరు కన్న కూతుళ్లు, తోడ బుట్టిన చెల్లేళ్లను అతి దారుణంగా హత్య చేసి తమ పగను చల్లార్చుకుంటున్నారు. అంతటి ఆగకుండా తాము ఘనకార్యం చేసినట్లు ఆ ఘనను చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పెడుతున్నారు. తాజాగా ఓ తండ్రి తన కూతురు ఓ వ్యక్తిని ప్రేమిస్తుందన్న కారణంతో తమ కుటుంబానికి చెడ్డపేరు వస్తోందని భావించి ఆమెను కిరాతకంగా హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది.

పదునైన ఆయుధంతో..

యూపీలోని పండేతారా గ్రామానికి చెందిన సర్వేశ్‌ కుమార్‌ అనే వ్యక్తి కూతురు (17), గత కొన్ని రోజులకు అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని ప్రేమిస్తోంది. ఈ విషయమై పలుమార్లు సర్వేశ్‌ తన కూతురిని పలుమార్లు హెచ్చరించారు. అయినా ఆమె తండ్రి మాట వినకపోవడంతో తన కుటుంబానికి మచ్చతెచ్చేలా ఉందని కూతురిని అంతమొందించాలని ప్రణాళిక రూపొందించుకున్నాడు. ఓ పదునైన ఆయుధంతో కన్న కూతురి తలను నరికి వేరు చేశాడు.

మొండెం అక్కడే వదిలి తలను తీసుకొని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లసాగాడు. సర్వేశ్‌ను చూసిన బాటసారులు భయాందోళనకు గురై పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలతో పాటు నిందితుడిని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు విచారించగా ‘తన కూతురిని తానే ఇంట్లో గడియపెట్టి హత్య చేశానని.. ఇందులో ఎవరీ ప్రమేయం లేదన్నాడు. తన మాట విననందుకే హత్య చేయాల్సి వచ్చిందని.. మొండెం నుంచి తల వేరు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తీసుకు వస్తున్నానన్నాడు.’ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news