సీరియల్ నటి ఝాన్సీ సూసైడ్ కేసు.. ఝాన్సీ ప్రియుడి అరెస్ట్

-

సంచలనం సృష్టించిన సీరియల్ నటి ఝాన్సీ ఆత్మహత్య కేసులో రోజుకో కొత్తకోణం వెలుగులోకి వస్తోంది. తాజాగా ఆమె కేసులో మరికొన్ని నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం ఝాన్సీ ప్రియుడు సూర్యతేజను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారిస్తున్నారు. ఝాన్సీ ఆత్మహత్య చేసుకున్నప్పటి తర్వాత నుంచి సూర్య కనిపించకుండా పోయాడు. అతడి కోసం గాలించిన పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. అతడి మొబైల్‌ను సీజ్ చేశారు. ఝాన్సీ, సూర్య మధ్య జరిగిన ఫోన్ కాల్ డేటా, వాట్సప్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు.

సూర్య గతంలో మరో యువతి మధును ప్రేమించినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఝాన్సీ పరిచయం అయ్యాక మధుకు బ్రేకప్ చెప్పినట్టు సమాచారం. మధు ద్వారానే ఝాన్సీతో పరిచయం పెంచుకొని ఝాన్సీకి సూర్య దగ్గరైనట్టు తెలుస్తోంది. ఇటీవలే ఝాన్సీ సూర్య బర్త్‌డే సందర్భంగా ఖరీదైన బైక్ కూడా కొనిచ్చిందట. తన దగ్గర ఉన్న బంగారు నగలను కూడా ఝాన్సీ.. సూర్యకు ఇచ్చినట్టు ఝాన్సీ తల్లి ఆరోపిస్తున్నారు. సూర్య తన కూతురును తీవ్రంగా వేధించాడని.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని.. అందుకే తన కూతురు ఆత్మహత్య చేసుకున్నట్టు ఝాన్సీ కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇక మీదట సీరియళ్లలో నటించకూడదని ఝాన్సీకి సూర్య కండీషన్ పెట్టినట్టు వాళ్లు ఆరోపించారు. దానికి ఝాన్సీ ఒప్పుకోలేదని.. దీంతో వాళ్ల మధ్య విభేదాలు వచ్చాయన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version