కేరళలో దారుణం చోటుచేసుకుంది. సరదాగా మెసెజెస్‌లో పంపుకునే ఎమోజీ ఇద్దరి ప్రాణాలు తీసింది. ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. వివరాల్లోకివెళితే.. కేరళ రాష్ట్రంలోని పతనంతిట్టకు చెందిన బైజు,వైష్ణవి ఇద్దరు భార్యాభర్తలు.
వీరి ఇంటి ఎదురుగా విష్ణు అనే వ్యక్తి ఉండేవాడు. ఇతనికి బైజు భార్య వైష్ణవికి పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఓ రోజు విష్ణు వైష్ణవి వాట్సాప్‌కు ‘కిస్’ ఎమోజీని పంపించాడు. అది కాస్త ఆమె భర్త బైజు కంటపడింది.దీంతో వారిద్దరి మధ్య గొడవకు దారితీసినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే కోపోద్రిక్తుడైన బైజు.. కత్తితో తన భార్యను నరికాడు. అనంతరం విష్ణును కూడా నరికి హత్య చేసినట్లు తెలిసింది. కిస్ ఎమోజీ కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్రంలో ఈ విషయం సంచలనంగా మారింది.