ఓయో హోటల్ గదుల్లో సీక్రెట్ కెమెరాలు అమర్చి, అక్కడికి వెళ్లే జంటల వీడియోలు తీస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం, నలుగురు సభ్యులు వేర్వేరు గ్యాంగులతో కలిసి పని చేస్తూ ఈ నేరాలకు పాల్పడుతున్నారు. సాధారణంగా వీళ్లు అవసరమైన వారికి ఓయో హోటల్స్ లో రూమ్స్ బుక్ చేసి కమిషన్ తీసుకుంటారు.
ఈ క్రమంలోనే రూమ్స్ లో సీక్రెట్ కెమెరాలు పెట్టి, అక్కడ ఉండేందుకు వచ్చిన జంటల ఏకాంతంగా గడిపిన క్షణాలను వీడియో రికార్డు చేస్తారు. అనంతరం ఆ వీడియోను సంబంధిత జంటలకు పంపి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. అడిగిన మొత్తం అప్పజెప్పకుంటే, ఇవ్వకుంటే రహస్యంగా తీసిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. అయితే డబ్బులు ఇవ్వకుంటే వేధింపులకు గురి చేస్తామంటూ నిందితులు బెదిరిస్తున్నారని ఓ బాధిత జంట పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఉదాంతం వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన నోయిడా పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.