ఆస్ట్రేలియాలో దారుణ హత్యకు గురైన తెలంగాణకు చెందిన ప్రీతిరెడ్డి హత్య కేసు ఇంకా మిస్టరీగానే ఉంది. తన హత్య కేసును చేధించడానికి ఆస్ట్రేలియా పోలీసులు చాలా కష్టపడుతున్నారు. ఎందుకంటే.. ప్రీతిరెడ్డిని హత్య చేసిన ఆమె మాజీ బాయ్‌ఫ్రెండ్ హర్షవర్ధన్ కూడా చనిపోవడంతో ఈ కేసు ఎటూ తేలట్లేదు.
ఆమె ఫ్రెండ్స్ కథనం ప్రకారం.. ప్రీతిరెడ్డి, హర్షవర్ధన్ ఇద్దరు 2013 నుంచి డేటింగ్‌లో ఉన్నారని.. అయితే హర్షవర్ధన్ ప్రవర్తన సరిగ్గా లేక.. ప్రీతి అతడిని మూడు నెలలకే వదిలేసిందని చెబుతున్నారు. తర్వాత తనకు మరో వ్యక్తితో పరిచయం అయిందని.. అతడితో ప్రీతి సంతోషంగా ఉండేదని వాళ్లు వెల్లడించారు.
అయితే.. ప్రీతిరెడ్డి అంటే హర్షవర్ధన్‌కు చాలా ఇష్టమని.. అందుకే.. హర్షవర్ధన్ ఎప్పుడూ ఆమె వెంట పడేవాడని పోలీసుల విచారణలో తెలిసింది. మార్చి 2న హర్షవర్ధన్.. ప్రీతిని కలిశాడు. ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. తర్వాత మార్చి 3న ప్రీతి కనిపించకుండా పోయింది. మార్చి 4న ప్రీతి కనిపించకుండా పోయిందని హర్షవర్ధన్ కు తెలిసిందని.. అయితే.. ఆమె ఎక్కడికి పోయిందో తనకు తెలియదని హర్ష.. తన ఫ్రెండ్‌కు మెసేజ్ చేసినట్లు తెలుస్తోంది.
అప్పటికే హర్షవర్ధన్ ఆమెను హత్య చేసి ఉండొచ్చని ఆస్ట్రేలియా పోలీసులు అనుమానిస్తున్నారు. మార్చి 2న ప్రీతిరెడ్డి, హర్షవర్ధన్ ఏం మాట్లాడుకున్నాడు? హర్షవర్ధన్ మళ్లీ ప్రీతిరెడ్డిని ఎందుకు కలిశాడు? వాళ్లిద్దరి మధ్య ఏం జరిగింది? ప్రీతిరెడ్డిని ఎందుకు హర్షవర్ధన్ చంపాల్సి వచ్చింది? అనే విషయాలు తెలియక ఆస్ట్రేలియా పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.