ఒకపక్క దేశం మొత్తం కరోనా భయంతో అల్లల్లాడుతు… లాక్ డౌన్ అమలవుతుంటే… వీరు మాత్రం వీరిపని మానలేదు! మాస్కులు వాడటం.. భౌతిక దూరం పాటించడమే ప్రథమ కర్తవ్యం అని ప్రభుత్వాలు మొత్తుకుంటుంటే… వీరిపని వీరు చేసుకుపోతున్నారు! చత్తీస్ ఘడ్ లోని బిలాస్ పూర్ లో వ్యభిచార నిర్వాహాకులు తమ వ్యాపారాన్ని యధేఛ్ఛగా కొనసాగిస్తున్నారు.
లాక్‌డౌన్ సమయంలో అన్ని వ్యాపారాలు మూతపడితే వ్యభిచార నిర్వాహకులు మాత్రం తమ దందాను యథేచ్చగా కొనసాగిస్తున్నారు. కరోనా కట్టడి చేయాలంటే మనషుల మధ్య భౌతిక దూరం పాటించాలని డాక్టర్లు చెబుతుంటే.. అవేమీ పట్టకుండా వ్యభిచార నిర్వాహకులు మాత్రం మహిళల శరీరాలతో వ్యాపారం చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. తాజాగా చత్తీస్ ఘడ్లోని బిలాస్ పూర్ లో మహిళల శరీరాలతో వ్యాపారం చేస్తూన్న సెక్స్ రాకెట్ ను పోలీసులు చాకచక్యంగా చేధించారు. ఈ ఆపరేషన్ లో వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళా బ్రోకర్, ఇద్దరు సెక్స్ వర్కర్లతో పాటు ఓ విటుడుని అదుపులోకి తీసుకున్నారు.
వివారాళ్లోకి వెళ్తే… లాక్ డౌన్ టైం లోనూ వ్యభిచారం జరుగుతోందనే సమాచారం అందుకున్న పోలీసులు పక్కా ప్లాన్ వేశారు. ఓ పోలీసుని విటుడిగా నటించమని… బ్రోకర్ తో మంతనాలు జరిపారు. బ్రోకర్ చెప్పిన రేటుకు కొంచెం అటుఇటుగా బేరం ఆడిన ఆ పోలీసు ఆ ఇంట్లోకి ప్రవేసించాడు. అనంతరం… గదిలోకి వెళ్లిఅక్కడి నుంచి తన సహచరులకు సమాచారం అందిచ్చాడు. దీంతో… అప్పటికే సిధ్దంగా ఉన్న పోలీసులు ఇంటిపై దాడి చేసి మహిళా బ్రోకర్ తో పాటు, ఇద్దరు యువతులతో ఉన్న ఒక విటుడిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి రెండు స్కూటీలు, 4 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి జనాలు ఉన్నంతకాలం కరోనా కట్టడి సాధ్యమేనా?? కాగా… ముంబైలోని రెడ్ లైట్ ఏరియాలోని వ్యభిచార గృహాల నిర్వాహాకులే తమ వ్యాపారాలు మూసేసుకుని వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే!