ఆటోలో మహిళపై అత్యాచార యత్నం..

-

ఒంటరిగా ఉన్న మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. ప్రభుత్వం ఎన్ని రక్షణ చర్యలు తీసుకున్నా.. ఎక్కడో అక్కడ మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం దిశ, నిర్భయ వంటి చట్టాలు తెచ్చినా.. కామాంధులు మారడం లేదు. తాజాగా మరో సంఘటన హైదరాబాద్ చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

ఆటో లో ఇంటికి బయలు దేరిన మహిళపై అత్యాచార యత్నానికి పాల్పడ్డారు కామాంధులు. ఈసంఘటన పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం. ఫలక్ నుమా వట్టెపల్లికి చెందిన మహిళ(35) స్థానికంగా ఉన్న ఫంక్షన్ హాల్ లో పనిచేస్తుంది. ఇటీవల సోమవారం సాయంత్రం పని ముగించుకున్న తరువాత ఇంటికి ఆటోలో బయలుదేరింది. కొంతదూరం వెళ్లిన తర్వాత ఆటో రూటు మార్చి జల్ పల్లి కార్గో రోడ్డుకు తీసుకెళ్లాడు. ఆటోడ్రైవర్‌తో పాటు మరో వ్యక్తి కలిసి ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ అత్యాచారయత్నం చేశారు. సమీపంలో ఓ దాబా దగ్గరకు రాగానే ఆమె కేకలు వేయడంతో ఆమెను అక్కడ దింపేసి పరారయ్యారు. మంగళవారం బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు ఆటోనంబర్‌ వివరాలు చెప్పలేకపోవడంతో పోలీసులు కార్గో రోడ్డులో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version