ఒక్కొక్కటిగా బయట పడుతున్న రవిప్రకాశ్ లీలలు.. ఇప్పటి వరకు 30 సిమ్ కార్డులు మార్చాడు..?

-

రవిప్రకాశ్ పై ఫోర్జరీ, డేటా చౌర్యం, డబ్బు తరలింపు లాంటి కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఆయనకు పంపించిన ఏ నోటీసుకూ స్పందించలేదు. సీఆర్పీసీ 160, 41 సెక్షన్ల కింద పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు.

టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాశ్ లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. రవిప్రకాశ్.. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు ఇప్పటి వరకు 30 సిమ్ కార్డులను మార్చారట. ముందు నుంచి పర్ ఫెక్ట్ ప్లాన్ తో ముందుకెళ్తున్న రవి ప్రకాశ్.. పోలీసులకు కొంచెం క్లూ కూడా దొరకకుండా అజ్ఞాతంలో ఉన్నారు. టీవీ9 సీఈవో పదవి నుంచి రవి ప్రకాశ్ ను తొలగించడం దగ్గర్నుంచి.. ఇప్పటి వరకు రవిప్రకాశ్ 30 సిమ్ కార్డులను మార్చారట.

అంతే కాదు.. టెక్నాలజీని ఉపయోగించుకొని… తన జాడ తెలియకుండా ఉండటం కోసం వైఫై కనెక్ట్ చేసుకొని కేవలం వాట్సప్ కాల్స్ మాత్రమే మాట్లాడేవారట. అలా.. ఆయన ఆచూకీ తెలియకుండా జాగ్రత్త పడ్డారన్నమాట.

తనపై నమోదైన మూడు క్రిమినల్ కేసుల్లో ముందస్తు బెయిలు మంజూరు చేయాలంటూ కోర్టను ఆశ్రయించారు. పోలీసుల దర్యాప్తుకు వస్తానని.. కాకపోతే కొంచెం సమయం కావాలని పోలీసులకు రవిప్రకాశ్ మెయిల్ పంపించారు.

రవిప్రకాశ్ పై ఫోర్జరీ, డేటా చౌర్యం, డబ్బు తరలింపు లాంటి కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఆయనకు పంపించిన ఏ నోటీసుకూ స్పందించలేదు. సీఆర్పీసీ 160, 41 సెక్షన్ల కింద పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఆయన నుంచి స్పందన లేకపోవడంతో… రవిప్రకాశ్, గరుడ పురాణం శివాజీపై లుక్ అవుట్ నోటీసును ఇష్యూ చేశారు. వాళ్లు దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకు ఈ నోటీసు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version