మే 23 త‌రువాత ప‌వ‌న్ ఏం చేస్తారు..?

-

ఎగ్జిట్ పోల్స్ చెప్పిన‌ట్లుగా జ‌న‌సేన పార్టీకి కేవ‌లం ఒక స్థాన‌మే వ‌చ్చినా లేదా అస‌లు అసెంబ్లీ స్థానాలే రాక‌పోయినా.. ప‌వ‌న్ త‌న పోరాటాన్ని మాత్రం కొన‌సాగిస్తార‌ట‌.

దేశ‌వ్యాప్త సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఎన్‌డీఏకే అనుకూలంగా వ‌చ్చిన విష‌యం విదిత‌మే. ఇక ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే ఎగ్జిట్ పోల్స్ అధికారాన్ని క‌ట్ట‌బెట్టాయి. అలాగే సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు చెందిన జ‌న‌సేన పార్టీకి 0 నుంచి 1 అసెంబ్లీ స్థానం మాత్ర‌మే వ‌స్తుంద‌ని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాలు నిజ‌మే అయి నిజంగానే జ‌న‌సేన‌కు అస‌లు అసెంబ్లీ స్థానాలు రాక‌పోయినా లేదా ప‌వ‌న్ పోటీ చేసిన స్థానాల్లో ఒక్క స్థానం మాత్ర‌మే వ‌చ్చినా.. జ‌న‌సేన‌కు గ‌ట్టి షాక్ త‌గ‌ల‌డం ఖాయ‌మే. మ‌ర‌లాంట‌ప్పుడు జ‌న‌సేనాని ప‌య‌న‌మెటు..? మే 23వ తేదీన ఫ‌లితాల వెల్ల‌డి అనంత‌రం ప‌వ‌న్ కార్యాచ‌ర‌ణ ఏమిటి ? జ‌న‌సేన పార్టీ ఎలా ముందుకు కొన‌సాగుతుంది ? అన్న విష‌యాల‌ను ఒక్క‌సారి ప‌రిశీలిస్తే…

ఎగ్జిట్ పోల్స్ చెప్పిన‌ట్లుగా జ‌న‌సేన పార్టీకి కేవ‌లం ఒక స్థాన‌మే వ‌చ్చినా లేదా అస‌లు అసెంబ్లీ స్థానాలే రాక‌పోయినా.. ప‌వ‌న్ త‌న పోరాటాన్ని మాత్రం కొన‌సాగిస్తార‌ట‌. కాక‌పోతే ఫ‌లితాల వెల్ల‌డి అనంత‌రం కొద్ది రోజులు కుటుంబ స‌భ్యుల‌తో టూర్ వేస్తార‌ని తెలిసింది. ఆ త‌రువాత ఇండియాకు వ‌చ్చి పార్టీ కార్య‌క‌లాపాల్లో నిమ‌గ్న‌మ‌వుతార‌ట‌. పార్టీతోపాటు త‌న భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌ను కూడా ప‌వ‌న్ అప్పుడే ప్ర‌క‌టిస్తార‌ట‌.

ఇక ప‌వ‌న్ తాను పోటీ ఏదైనా ఒక అసెంబ్లీ స్థానం నుంచి గెలిచి అసెంబ్లీకి వెళితే.. చ‌ట్ట‌స‌భ సాక్షిగా ప్ర‌జా స‌మ‌స్య‌ల కోసం పోరాటం చేస్తార‌ని తెలిసింది. అస‌లు సీట్లేవీ రాక‌పోయినా అసెంబ్లీ బ‌య‌ట నుంచే ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేస్తానని గ‌తంలో ప‌వ‌న్ చెప్పారు. ఈ క్ర‌మంలో అసెంబ్లీ సీట్లు ఏమీ రాక‌పోతే ప‌వ‌న్ అదే బాట‌లో ప‌య‌నించే అవ‌కాశం ఉంది. అయితే ఏ విష‌య‌మైందీ తేలాలంటే ఈ నెల 23వ తేదీ వ‌ర‌కు వేచి చూడ‌క త‌ప్ప‌దు..!

Read more RELATED
Recommended to you

Exit mobile version