అస్సాం రాష్ట్రం హోజాయ్ జిల్లా పరిధిలోని లంక పియాలీ మార్కెట్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘోర అగ్ని ప్రమాదంలో… ఏకంగా.. 250 దుకాణాలు దగ్ధం అయ్యాయి. ఈ సంఘటన నిన్న అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. హోజాయ్ జిల్లాలోని లంక పియాలీ మార్కెట్‌లో శుక్రవారం అర్థరాత్రి ఒక్క సారిగా భారీగా అగ్ని ప్రమాదం సంభవించింది.
అసలు ఆ అగ్ని ప్రమాదం ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు కానీ.. మంటలు ఒక్కసారిగా ఎగిసి పడ్డాయి. తొలుత ఒక దుకాణంలో మంటలు చెలరేగగా, నిమిషాల వ్యవధిలోనే ఇతర దుకాణాలకు మంటలు వ్యాపించాయి. అయితే..రాత్రి సమయంలో కావడంతో ఆ దుకాణాల్లో జనాలు ఎవరూ లేరు. ఇక మంటలు ఎగిసిపడటంతో.. ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు స్థానికులు.
దీంతో 12 ఫైర్ ఇంజన్ వాహనాలు రంగంలోకి దిగి.. మంటలు ఆర్పేందుకు ప్రయత్నించాయి. కానీ అప్పటికే 250 దుకాణాలు దగ్ధం అయ్యాయి. అగ్నిప్రమాదంలో కోట్లాది రూపాయల ఆస్తినష్టమైనట్లు సమాచారం. కానీ మంటలు చెలరేగడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Assam | Several shops were gutted in a massive fire at Piyali Market in Lanka under Hojai district last night. No casualties were reported in the incident pic.twitter.com/m6eTbR65PI
— ANI (@ANI) April 9, 2022