Pawan Kalyan: ‘వకీల్ సాబ్’కు ఏడాది..ట్రెండ్ సెట్టర్ పవన్ కల్యాణ్

-

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దాదాపు మూడేళ్ల తర్వాత సినీ ఇండస్ట్రీకి ‘వకీల్ సాబ్’గా రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద చక్కటి విజయం సాధించింది. బాలీవుడ్ సూపర్ హిట్ ఫిల్మ్ ‘పింక్’ రీమేక్ గా వచ్చిన ఈ పిక్చర్ లో పవన్..లాయర్ గా నటించారు. చక్కటి సందేశంతో యువత, ప్రజానీకం ఆలోచించే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం పవన్ అభిమానులకు, సినీ ప్రేక్షకులకు బాగా నచ్చింది.

వేణుశ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి దిల్ రాజు ప్రొడ్యూసర్. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందించగా, అంజలి, అనన్య నాగళ్ల, నివేదా థామస్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం విడుదలై ఏడాది అయిన సందర్భంగా నెట్టింట అభిమానులు సందడి చేస్తున్నారు. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్వి్ట్టర్ లో ‘వకీల్ సాబ్’ ఫిల్మ్ రిలీజ్ నాటి వీడియోలు, పోస్టర్స్ షేర్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ అశేష అభిమానులు #PawanKalyan పవన్ కల్యాణ్ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తు్న్నారు. దాంతో పవన్ కల్యాణ్ పేరు ట్విట్టర్ లో ఎంటర్ టైన్మెంట్ కేటగిరీలో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ అన్ సీన్ స్టిల్స్, ‘హరిహర వీరమల్లు’ సెట్ లో పవన్ ప్రాక్టీస్ ఫొటోలు, లెజెండరీ ఆర్ట్ డైరెక్టర్ పద్మశ్రీ తోట తరణిని పవన్ సత్కరించిన ఫొటోలు షేర్ చేస్తున్నారు.

తాజాగా ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్ పవన్ కల్యాణ్ ను కలిసిన ఫొటోలు కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ ప్రజెంట్ ఓ వైపున పాన్ ఇండియా ఫిల్మ్ ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ లో పాల్గొంటున్నారు. మరో వైపున హరీశ్ శంకర్ ‘భవదీయుడు భగత్ సింగ్’ చిత్ర షూటింగ్ లో పాల్గొనడానికి కూడా రెడీ అవుతున్నారు. ఈ రెండు చిత్రాలపైన భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version