రూ. 5000 ఇవ్వలేదని భార్య ఆత్మహత్య…. చితిలో దూకి చనిపోయేందుకు భర్త ప్రయత్నం

-

చిన్న విషయాలే సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి. చిన్నచిన్న కోరికలు తీర్చనుందుకు అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు కొంతమంది మహిళలు. షాపింగ్ తీసుకెళ్లలేదని, భర్త తిట్టాడని, భర్త డబ్బులు అడిగే ఇవ్వలేదనే చిన్న కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది. ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే… భార్య ఆత్మహత్యను తట్టుకోలేక భర్త కూడా భార్య చితిలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడు.పూర్తి వివరాల్లోకి వెళితే…ఉత్తర్ ప్రదేశ్ మహోబా జిల్లా జైత్ పుర్ గ్రామంలో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మహోబా జిల్లా కల్ పహాడ్ కొత్వాలి పరిధిలోని జైత్ పుర్ లో బ్రిజేష్, ఉమ దంపతులు నివసిస్తున్నారు. కాగా.. తనకు రూ. 5000 కావాలని ఉమ, భర్త బ్రిజేష్ ను అడిగింది. అయితే రేపు ఇస్తానని బ్రిజేష్ అన్నారు. దీంతో మనస్తాపం చెందిన ఉమ ఉరి వేసుకున ఆత్మహత్య చేసుకుంది. ఉదయం లేచి చూడగానే ఉరికి వేలాడుతోంది. వెంటనే స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించగా… అప్పటికే మరణించిందని వైద్యులు వెల్లడించారు. పోస్ట్ మార్టం తరువాత దహనసంస్కారాలకు స్మశాన వాటిక తీసుకెళ్లారు. అయితే చితిలో కాలుతున్న తన భార్య ఉమతో తను కూడా తనువు చాలించాలని భావించాడు భర్త బ్రిజేష్. భార్య చితిలో దూకాడు. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు గాయాలపడిన బ్రిజేష్ ను రక్షించారు. ఇదిలా ఉంటే మృతురాలి తల్లిదండ్రులు మాత్రం కట్నం కోసమే భర్త, అత్తమామలు తమ కూతురును చంపేశారంటూ ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు వివరాలు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

 ]

Read more RELATED
Recommended to you

Exit mobile version