ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కొత్త కేబినెట్ ను సీఎం జగన్ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. నేడు కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారం చేయనుంది. గతంలో మంత్రులుగా ఉన్న వారిలో 11 మందికి వైఎస్ జగన్ అవకాశం ఇచ్చారు. అయితే ఇటీవల రాజీనామా చేసిన వారిలో చాలా మంది కొత్త కేబినెట్ లో మంత్రి పదువులు ఆశించారు. అయితే వారి ఆశాలపై వైఎస్ జగన్ నీళ్లు చల్లారు. దీంతో పలువురు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు.. వైసీపీ పై, జగన్ మోహన్ రెడ్డిపై గుర్రుగా ఉన్నారు. ఇప్పటికే పలువురు తమ కోపాన్ని మీడియా ముందే చూపారు.
తాజా గా మేకతోటి సుచరిత.. వైసీపీకి షాక్ ఇచ్చింది. తన ఎమ్మెల్యే పదవికి ఏకంగా రాజీనామా చేసేసింది. గత కేబినెట్ లో రాష్ట్ర హోం మంత్రిగా మేకతోటి సుచరిత పని చేశారు. అయితే ఇటీవల జగన్ ఆదేశాలతో రాజీనామా చేశారు. అయితే తనకు కొత్త కేబినెట్ లో స్థానం ఉంటుందని అనుకున్నారు. కానీ సుచరితకు కొత్ కేబినెట్ లో స్థానం దక్కలేదు.
దీంతో సుచరిత తీవ్ర మనస్థాపానికి గురి అయింది. తన ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేశారు. తన రాజీనామా లేటర్ ను పంపించారు. కాగ పాత వారిని కొందరిని తీసుకుని తనను పక్కన బెట్టడంపై సుచరిత ఆవేధన వ్యక్తం చేశారు. సుచరిత వర్గీయులు కూడా వైసీపీ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. కాగ ఈ కొత్త కేబినెట్ చిచ్చు.. జగన్ కు ఇంకా ఎన్ని సమస్యలు తెస్తుందో చూడాలి.