ఒంటిరిగా ఉన్న లేడీకి కిస్‌ ఇచ్చి..డెలివరీ బాయ్‌ దారుణం..!

మొబైల్ యాప్ ద్వారా ఆర్డర్ చేసిన ఆహారాన్ని డెలివరీ చేసేందుకు వచ్చిన డెలివరీ బాయ్ యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు. 19 ఏళ్ల ఆ యువతి ఇంట్లో ఒంటరిగా ఉన్నట్లు గుర్తించి మాట కలిపాడు. తాగేందుకు నీళ్లు ఇవ్వమని అడిగాడు. గ్లాసులో నీళ్లు తెచ్చి ఇవ్వగా తాగి, మరో గ్లాస్ వాటర్ అడిగాడు. మంచినీళ్లు తెచ్చేందుకు యువతి వెనక్కి తిరగగానే వెనకనుంచి పట్టుకొని ఆమె చెంపపై బలవంతంగా రెండుసార్లు ముద్దు పెట్టాడు.

మైనర్ బాలికపై అత్యాచారం
మైనర్ బాలికపై అత్యాచారం

ఆ హఠాత్పరిమానానికి యువతి షాక్ కు గురైంది. కేకలు వేయడంతో అతడు పారిపోయాడు. పూణే నగరంలో శనివారం రాత్రి 9:30 గంటల సమయంలో చోటుచేసుకున్న ఈ ఘటన సంచలనంగా మారింది. బాధితురాలు కేకలు విని అప్రమత్తమైన ఇరుగు పొరుగువారు, పారిపోతున్న నిందితుడిని పట్టుకున్నారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనతో నిశేష్టురాలై, మౌనం వహించిన యువతికి నచ్చజెప్పి పోలీసులకు ఫిర్యాదు చేయవలసిందిగా పురామాయించారు. మరో అమ్మాయికి ఇలా జరగకుండా చూసేందుకైనా ఫిర్యాదు చేయాలని నచ్చచెప్పారు.